Puneeth Rajkumar : నాటు నాటు సాంగ్.. పునీత్ స్టైల్‌లో అదిరిపోయింది.. వీడియో వైర‌ల్..!

November 22, 2021 8:42 PM

Puneeth Rajkumar : పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఇటీవలె విడుదలైన మాస్‌ సాంగ్‌ నాటు నాటుకు విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే పాట, ఎవ‌రు డ్యాన్స్ చేసినా ఇవే స్టెప్స్. 10 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఈ సాంగ్‌ను ఇప్పటికే చాలామంది నెటిజన్లు రీక్రియేట్‌ చేస్తూ స్టెప్పులేస్తున్నారు. ఇటీవ‌ల‌ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సోహేల్‌, మెహబూబ్‌.. నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే మాస్‌ స్టెప్పులేశారు.

Puneeth Rajkumar natu natu song video viral

చాలా మంది నెటిజన్లు తమ అభిమాన స్టార్ హీరోల మాషప్ సాంగ్స్ కి నాటు నాటు ట్యూన్ ని జోడిస్తున్నారు. వీటిలో కొన్ని క్లిప్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పునీత్ రాజ్ కుమార్ డ్యాన్సులతో నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సును దోచుకుంటోంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నృత్యకారులలో పునీత్‌ ఒకరు. అత‌ని స్టైల్‌లో రూపొందించిన నాటు నాటు సాంగ్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

పునీత్ దురదృష్టవశాత్తూ గత నెలలో ఆకస్మికంగా గుండె పోటు కారణంగా మరణించారు. అతని అభిమానులు నాటు నాటు మాషప్ వీడియోలతో సంస్మరించుకోవడం హృదయాల్ని టచ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ అంతటా వైరల్ అవుతోంది. అది చివరికి ఆర్ఆర్ఆర్ టీమ్ కి కూడా చేరింది. ఇది అద్భుతమైన కూర్పు అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రశంసించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now