Puneeth Rajkumar : పునీత్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు.. సిద్ధార్థ్ ఎమోష‌న‌ల్‌..

November 9, 2021 2:56 PM

Puneeth Rajkumar : కన్నడ సినీ ఇండస్ట్రీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన దివంగత పునీత్ రాజ్ కుమార్ 11వ రోజు కార్యక్రమానికి ఆయన సమాధిని దర్శించుకునేందుకు నటుడు సిద్ధార్థ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పునీత్ రాజ్ కుమార్ కు తాను కూడా అభిమానిని అని.. అలాంటి వారు ఇంకేవ్వరూ ఉండరని సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ మరణం యావత్ సినీ ఇండస్ట్రీకే లోటు అని.. ఆయన సేవా కార్యక్రమాలు ఎంతో ఉన్నతమైనవని.. అలాంటి వ్యక్తి స్థానాన్ని ఇంకెవ్వరూ రీప్లెస్ చేయలేరని సిద్ధార్థ్ తెలిపారు. ఆయన టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.

there will be no man like Puneeth Rajkumar  says siddharth

అలాగే పునీత్ యంగ్ టాలెంట్ ని ఆదరించే గొప్ప వ్యక్తిగా ఉండేవారని, ఆయనకు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు, ప్రఖ్యాతులు ఉన్నా ఎప్పుడూ సింపుల్ గా, సైలెంట్ గా ఉంటారని అన్నారు. సిద్ధార్థ్, పునీత్ ను కలిసిన ప్రతిసారి ఓ కొత్త విషయాన్ని నేర్చుకునేవాడినని అన్నారు. ఆయన ఎప్పుడూ ఇతరుల్ని మెచ్చుకుంటూ ప్రొత్సహించేవారని సిద్ధార్థ్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. పునీత్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయన మరణానికి చింతిస్తూ.. కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత పునీత్ భార్య అశ్విని మాట్లాడారు.

తన భర్త మరణంతో దిగ్భ్రాంతికి గురైన తమకు, తమ కుటుంబానికి ఎంతో సపోర్ట్ గా నిలిచిన అభిమానులకు.. ఆయన అంత్యక్రియలకు అవసరమైన కార్యక్రమాల్ని దగ్గరుండి చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అంతా సజావుగా సాగేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పారు. పునీత్ 11వ రోజు జరిగిన కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన కుటుంబ సభ్యులు, కన్నడ సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆహ్వానితులు హాజరయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment