మంగళవారం, జూన్ 23, 2026
వార్తలు

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత హాస్పిటల్ కు క్యూ కడుతున్న ప్రజలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Puneeth Rajkumar : కన్నడ సినీ ఇండస్ట్రీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే హార్ట్ ఎటాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించాడన్న విషయం తెలియడంతో ఎంతో మంది ప్రజలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఈ…

Puneeth Rajkumar : పునీత్ మరణం తర్వాత హాస్పిటల్ కు క్యూ కడుతున్న ప్రజలు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Puneeth Rajkumar : కన్నడ సినీ ఇండస్ట్రీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే హార్ట్ ఎటాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించాడన్న విషయం తెలియడంతో ఎంతో మంది ప్రజలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ ఈ విషయం గుర్తుకు చేసుకున్నా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులే కాకుండా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు కూడా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు.

Puneeth Rajkumar  death causing stress in people going to hospitals

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి బాలనటుడుగా పరిచయమైన పునీత్ ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన బాగా వర్కౌట్లు చేస్తుంటారు. అలా ఓ రోజు హెవీ వర్క్ అవుట్ చేయడంతో ఛాతిలో నొప్పితో హాస్పిటల్ లో చేరగా వెంటనే ప్రాణాలు కోల్పోయారు.

ఈయన మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం మాత్రం కర్ణాటకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పునీత్ మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది ప్రజలు భయాందోళనలకు గురవుతూ గుండెకు సంబంధించిన టెస్టులు చేయించుకోవడం కోసం హాస్పిటళ్లలో క్యూ లు కడుతున్నారు. ఈ విషయం గురించి డాక్టర్లు కూడా తెలిపారు.

పునీత్ మరణం తర్వాత హాస్పిటల్ కు గుండె చెకప్ కోసం వస్తున్న వారి సంఖ్య 35 శాతం మేర పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ హాలిడే రోజు 1700 మంది చెకప్‌ చేయించుకున్నారని తెలిపారు. ఎంతో దృఢమైన శక్తి ఉన్న పునీత్ కే గుండె సమస్య రావటంతో తమ పరిస్థితి ఏంటని భయపడుతున్నారు ప్రజలు. ఇక ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారడంతో అందరూ షాకవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి