గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pawan Kalyan : అరెరె.. హీరో సూర్య అలా చేయకపోతే పవన్‌కు బాగుండేది కదా..!

Pawan Kalyan : కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య సినిమాలంటే అటు తమిళ ప్రేక్షకులతోపాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే సూర్య నటించిన సినిమాలు దాదాపుగా తెలుగులోనూ రిలీజ్…

Pawan Kalyan : అరెరె.. హీరో సూర్య అలా చేయకపోతే పవన్‌కు బాగుండేది కదా..!

Pawan Kalyan : కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్య సినిమాలంటే అటు తమిళ ప్రేక్షకులతోపాటు ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే సూర్య నటించిన సినిమాలు దాదాపుగా తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇక లేటెస్ట్ గా హీరో సూర్య యాక్ట్ చేసిన జై భీమ్ సినిమాపై కూడా మొదట్నుండీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు.

Pawan Kalyan missed chance because of suriya jai bhim movie telugu version

ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ చెందినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన జై భీమ్ సినిమాను ఎంతోమంది చూశారు. అలాగే రియల్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. ఓటీటీ అవ్వడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ తోపాటు సినిమా చూసే వారి సంఖ్య పెరగడం విశేషం. మరీ ముఖ్యంగా గిరిజనుల హక్కులను కాపాడే పాత్రలో సూర్య నటన, కాన్సెప్ట్, ఇంటెన్సిటీ ఇలా ఎన్నో అంశాలు.. సినిమా చూసేలా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలో సూర్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అలాంటి సినిమాని తెలుగులోకి సూర్య డబ్బింగ్ చేసి ఉండకపోతే.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్లాగా తెలుగులోకి రీమేక్ చేసి ఉండేవారు అనే భావనలో ఉన్నారు. ఇక ఈ సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో మరికాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేవలం రీమేక్ లు మాత్రమే చేస్తున్నారని.. కొత్త కథల్ని ఒప్పుకోవడం లేదంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి