Karthikeya : మ‌రికొద్ది రోజుల‌లో ఆర్ఎక్స్ 100 హీరో పెళ్లి.. చ‌క్క‌ర్లు కొడుతున్న వెడ్డింగ్ కార్డ్..

November 15, 2021 11:53 AM

Karthikeya : ఆర్‌ఎక్స్‌100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న హీరో కార్తికేయ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్‌గా రాజా విక్ర‌మార్క చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ సినిమా కూడా అనుకున్న విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

Karthikeya wedding card photo goes viral in social media

‘రాజా విక్ర‌మార్క’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కాబోయే భార్య లోహిత‌కు ప్ర‌పోజ్ చేసి ఆమెను అంద‌రికీ పరిచ‌యం చేశాడు. ఈ నెల 21న ఉద‌యం 9 గంట‌ల 47 నిమిషాల‌కు ఆర్ఎక్స్ 100 హీరో త‌న ఇష్ట‌స‌ఖి మెడ‌లో మూడు ముళ్లు వేయ‌నున్నాడ‌ట‌ ! ఈ మేర‌కు కార్తికేయ‌-లోహిత‌ల పెళ్లి కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వేడుక‌కు ఆయ‌న బంధుమిత్రుల‌తోపాటు టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది.

కాగా, కార్తికేయ ‘నిట్‌ వరంగల్‌లో 2010లో తొలిసారి లోహితను కలిశాడు. 2012లో ప్రపోజ్‌ చేశాడు. సంవత్సరం తర్వాత ఆమె ఒప్పుకుంది. బీటెక్‌ చదువుతున్న రోజుల్లో ఓసారి లోహిత నాకు పంపిన మెసేజ్‌ కారణంగా మా ఇంట్లో బాగా గొడవ జరిగింది. అప్పుడు ఫ్రాంక్ అని అబద్దం చెప్పి ఆ సమయంలో తప్పించుకున్నా. ఆ తర్వాత నాకు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితనే అని ఈ మధ్యే మా ఇంట్లో తెలిసింది.. అంటూ ఇటీవ‌ల చెప్పుకొచ్చాడు కార్తికేయ‌.

కాగా కార్తికేయ ల‌వ్ స్టోరీతో సినిమా తీయొచ్చు. 2010లో మొట్ట‌మొద‌టిసారి లోహిత‌ను క‌లిసిన ఈ హీరో 2012లో ప్ర‌పోజ్ చేశాడు. కానీ హీరో అయ్యాకే మీ ఇంటికి వ‌చ్చి మాట్లాడ‌తాన‌ని చెప్పాడు. హీరో అవ్వ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో త‌న ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికీ అంతే క‌ష్ట‌ప‌డ్డాడు. ఫైన‌ల్‌గా యూత్ హీరోగా నిల‌దొక్కుకున్నాక పెద్ద‌ల‌ను ఒప్పించి ఆమెను పెళ్లాడ‌బోతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment