Raja Vikramarka : కార్తికేయ రాజా విక్ర‌మార్క టీమ్‌కు విషెస్ చెప్పిన చిరంజీవి..!

November 11, 2021 11:11 PM

Raja Vikramarka : యంగ్ హీరో కార్తికేయ హీరోగా న‌టించిన తాజా చిత్రం.. రాజా విక్ర‌మార్క‌. ఈ మూవీ న‌వంబ‌ర్ 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలోనే రాజా విక్ర‌మార్క మూవీ టీమ్‌కి మెగాస్టార్ చిరంజీవి విషెస్ చెప్పారు.

chiranjeevi said best wishes to Raja Vikramarka movie team

కొత్త త‌రం న‌టీన‌టుల‌కు తాను ఎల్ల‌ప్పుడూ మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని ఈ సంద‌ర్బంగా చిరంజీవి తెలిపారు. త‌న ఫ్యాన్ అయిన కార్తికేయ కూడా హీరోగా ఎద‌గాల‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ అంత‌టి స్థాయికి చేరుకోవాల‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు చిరంజీవి ఓ సెల్ఫీ వీడియోను విడుద‌ల చేశారు.

కాగా రాజా విక్ర‌మార్క మూవీ యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇందులో యాక్ష‌న్ స‌న్నివేశాల‌తోపాటు కామెడీ కూడా ఉంటుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే తెలియ‌జేశారు. కార్తికేయ భిన్న‌మైన పాత్ర‌లో ఇందులో క‌నిపించ‌నున్నాడు. దీంతో ప్రేక్ష‌కుల్లో ఈ మూవీపై ఆస‌క్తి పెరిగింది. రాజా విక్ర‌మార్క మూవీకి శ్రీ సారిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. కార్తికేయ స‌ర‌స‌న ఫీమేల్ లీడ్ రోల్‌లో తాన్య ర‌విచంద్ర‌న్ న‌టించింది. శ్రీ చిత్ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రామారెడ్డి ఈ మూవీని నిర్మించారు. టి.ఆదిరెడ్డి స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now