గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Raja Vikramarka Review : రాజా విక్రమార్క మూవీ రివ్యూ

Raja Vikramarka Review : యంగ్ హీరో కార్తికేయ మ‌రోమారు రాజా విక్ర‌మార్క పేరుతో ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న న‌టించిన రాజా విక్ర‌మార్క మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ‌సారిప‌ల్లి ఈ మూవీకి…

Raja Vikramarka Review : రాజా విక్రమార్క మూవీ రివ్యూ

Raja Vikramarka Review : యంగ్ హీరో కార్తికేయ మ‌రోమారు రాజా విక్ర‌మార్క పేరుతో ప్రేక్ష‌కుల‌ను సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న న‌టించిన రాజా విక్ర‌మార్క మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శ్రీ‌సారిప‌ల్లి ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇందులో కార్తికేయ స‌ర‌స‌న తాన్య ర‌విచంద్ర‌న్ న‌టించింది. 88 రామారెడ్డి ఈ మూవీని నిర్మించారు. ప్ర‌శాంత్ విహారి సంగీతం అందించారు.

Raja Vikramarka Review  how is the movie

హీరో కార్తికేయ NIA ఆఫీస‌ర్‌. వారి బ్యాచ్‌కు త‌నికెళ్ల భ‌ర‌ణి ఇన్‌చార్జిగా ఉంటారు. హీరో, అత‌ని మిగిలిన NIA టీమ్ స‌భ్యులు ఒక సంఘ విద్రోహిని ప‌ట్టుకుని చంపుతారు. త‌రువాత ఓ సీక్రెట్ మిష‌న్‌పై హోంమంత్రి సాయికుమార్‌ను ర‌క్షించేందుకు వెళ్తాడు. కానీ అక్క‌డ అత‌నికి అనుకోని ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. అవేమిటి ? అత‌ను హోం మంత్రిని ర‌క్షించాడా ? లేదా ? క‌థ ఎలా మ‌లుపులు తిరిగింది ? అన్న వివ‌రాలను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

గ‌త చిత్రాల‌కు భిన్నంగా కార్తికేయ ఈ మూవీలో న‌టించాడు. యాక్ష‌న్‌, కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ జోనర్‌లో ఈ మూవీ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తుంది.

ఇక ఈ మూవీకి ఇప్ప‌టికే ప‌లు ప్రీమియ‌ర్ షోలు వేశారు. దీంతో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. యాక్ష‌న్‌, కామెడీ కావాల‌నుకునే వారు ఈ మూవీని ఒక్క‌సారి త‌ప్ప‌క చూడ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి