Karthikeya : కార్తికేయ 3 ఉందా.. లేదా.. క్లారిటీ ఇచ్చేసిన నిఖిల్‌..

September 22, 2022 10:49 PM

Karthikeya : టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ చాలా రోజుల తరువాత కార్తికేయ 2 ద్వారా చక్కని విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ అయింది. దీంతో నిఖిల్‌ కూడా పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టింది. ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీ హిట్‌ అయిన నేపథ్యంలో కార్తికేయ 3 ఉంటుందా.. లేదా.. అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు నిఖిల్‌ సమాధానం ఇచ్చాడు.

కార్తికేయ 3 సినిమాను తీస్తామని నిఖిల్‌ చెప్పాడు. అయితే ఈ మూవీని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది.. వంటి వివరాలను మాత్రం నిఖిల్‌ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇక కార్తికేయ 3 మూవీని 3డిలో రిలీజ్‌ చేస్తామని కూడా నిఖిల్‌ వెల్లడించాడు. కాగా కార్తికేయ 2లో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటించగా.. బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ముఖ్య పాత్రను పోషించారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌ అని చెప్పవచ్చు.

Karthikeya another movie is it there or not said nikhil
Karthikeya

ఇక కార్తికేయ 2 మూవీని శ్రీకృష్ణుడి కథాంశంతో తెరకెక్కించారు. కృష్ణుడికి చెందిన  ఒక కాలి పట్టీ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఉత్తరాదిలో కృష్ణుడికి చాలా మంది పూజలు చేస్తారు. కనుకనే సినిమా హిట్‌ అయిందని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now