Thank You Movie Review : నాగ‌చైత‌న్య థాంక్ యూ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

July 22, 2022 8:03 AM

Thank You Movie Review : ల‌వ్ స్టోరీ, బంగార్రాజు మూవీలు స‌క్సెస్ కావ‌డంతో అదే జోష్ తో చైతూ థాంక్ యూ అనే మూవీని చేశారు. ఇందులో ఆయ‌న‌కు జోడీగా రాశి ఖ‌న్నాతోపాటు మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌లు న‌టింటారు. ప్ర‌కాష్ రాజ్ మ‌రో కీల‌క‌పాత్ర‌ను పోషించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ ఈ మూవీ శుక్ర‌వారం (జూలై 22, 2022) థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. చైతూ దీంతో మ‌రో హిట్ కొడ‌తాడా.. అస‌లు క‌థ ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

అభిరామ్ (నాగ‌చైత‌న్య‌) అమెరికాలో కంపెనీ పెట్టి ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌ని చూస్తాడు. చివ‌ర‌కు అనుకున్న‌ది సాధిస్తాడు. కానీ ఆ క్ర‌మంలో అత‌ను త‌న క్యారెక్ట‌ర్‌ను కోల్పోతాడు. గ‌తంలో త‌న‌ను ఇష్ట‌పడేవాళ్లే త‌న‌ను విడిచిపెట్టి పోయేలా మారుతాడు. దీంతో తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది ? అవేమిటి ? చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? అభిరామ్ మ‌ళ్లీ క్యారెక్ట‌ర్‌ను మార్చుకుంటాడా ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Naga Chaitanya Thank You Movie Review know how is the movie
Thank You Movie Review

విశ్లేష‌ణ‌..

ఈ సినిమా అంత‌టినీ నాగ‌చైత‌న్య త‌న భుజాల‌పై మోశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. నాగ‌చైత‌న్య యాక్టింగ్‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌ను అయినా స‌రే అవ‌లీల‌గా చేయ‌గ‌ల‌డు. అయితే గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఇందులో చైతూ క‌నిపిస్తాడు. చైత‌న్య పాత్ర‌లో మ‌న‌కు కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఇది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అలాగే రాశి ఖ‌న్నా, మాళ‌వికా నాయ‌ర్‌, అవికా గోర్‌ల‌తోపాటు ప్ర‌కాష్ రాజ్ ఇత‌ర న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర బాగానే న‌టించారు.

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ విష‌యానికి వ‌స్తే.. ఆయన రాసుకున్న క‌థ‌, చెప్పిన విధానం బాగానే ఉంటాయి. కానీ ఏం జ‌రుగుతుందో ముందే తెలిసిపోతుంది. దీంతో సినిమాపై ఆస‌క్తి ఉండ‌దు. ఇక మూవీని చూస్తుంటే గ‌తంలో వ‌చ్చిన ప్రేమ‌మ్‌, ర‌వితేజ నా ఆటోగ్రాఫ్ ఛాయ‌లు కాస్త క‌నిపిస్తాయి. అందువ‌ల్ల క‌థలో కొత్త‌ద‌నం ఏమీ క‌నిపించ‌దు. అయిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా చూస్తే థాంక్ యూ ఓ డీసెంట్ మూవీగా నిలుస్తుంది. అయితే కొన్ని చోట్ల క‌థ‌నం బోరింగ్‌గా ఉంటుంది.

ఇక థ‌మ‌న్‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విష‌యంలో ఎంతో పేరుంది. అఖండ‌కు ఆయ‌న చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అలాగే స‌ర్కారు వారి పాట‌కు కూడా థ‌మ‌న్ అద్భుతంగా సంగీతం అందించాడు. కానీ థాంక్ యూలో మ్యూజిక్ అంత‌గా ఆక‌ట్టుకోదు. ఇంకాస్త వ‌ర్క్ చేసి ఉంటే బాగుండ‌నిపిస్తుంది. పీసీ శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీకి పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. సినిమాకు కావ‌ల్సిన మేర అవుట్‌పుట్ ఇచ్చారు. ఇక ఎడిటింగ్ కాస్త మెరుగ్గా ఉంటే బాగుండ‌నిపిస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే థాంక్ యూ సినిమాకు నాగ‌చైత‌న్య యాక్టింగ్‌, త‌క్కువ ర‌న్ టైమ్‌, పాజిటివ్ మెసేజ్ వంటివి ప్ల‌స్ పాయింట్స్ అని చెప్ప‌వ‌చ్చు. ఇక క‌థలో ఏం జ‌రుగుతుందో ముందుగానే తెలిసిపోతుండ‌డం, ఎమోష‌న్స్ అంత‌గా పండించ‌లేక‌పోవ‌డం, క‌థ కొన్ని సంద‌ర్భాల్లో తేలిపోవ‌డం, కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం, సంగీతం వంటివి ఈ సినిమాకు మైన‌స్ పాయింట్స్ అని చెప్ప‌వ‌చ్చు. అయిన‌ప్ప‌టికీ చాలా చోట్ల ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేస్తారు. క‌నుక ఏదైనా డిఫ‌రెంట్ మూవీని చూద్దామ‌నుకుంటే.. థాంక్ యూ ఒక బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ మూవీని ప్రేక్ష‌కులు ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now