గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Jabardasth Faima : జబర్దస్త్‌ ఫైమాకు బిగ్‌ బాస్‌ లో వారానికి అంత మొత్తం ఇవ్వనున్నారా..?

Jabardasth Faima : తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. ఇప్పటికే 5 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఆరో సీజన్‌ తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు కూడా…

Jabardasth Faima : జబర్దస్త్‌ ఫైమాకు బిగ్‌ బాస్‌ లో వారానికి అంత మొత్తం ఇవ్వనున్నారా..?

Jabardasth Faima : తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద రియాలిటీ షో సందడి మొదలైంది. ఇప్పటికే 5 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఆరో సీజన్‌ తాజాగా ప్రారంభమైంది. ఈ లేటెస్ట్ సీజన్‌కు కూడా నాగార్జునే హోస్ట్‌గా చేయనున్నాడు. బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు, ఐదు సీజన్స్‌ను అక్కినేని నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం సీజన్ 6 పేరిట గ్రాండ్ గా లాంఛ్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు బిగ్ బాస్ హౌస్ పైనే పడ్డాయి. నిజానికి హౌస్ లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఎవ్వరూ లేరు అనే టాక్ వినిపిస్తుంది.

రెమ్యూనరేషన్ కు కక్కుర్తిపడి బిగ్ బాస్ ఈసారి ఫేమస్ కంటెస్టెంట్ లని తీసుకురాలేదు అని ఓ ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే 17వ కంటెస్టెంట్‌గా ఫైమా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫైమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫైమా మంచి కమెడియన్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోలో నటించి ఓ రేంజ్‌లో పాపులారీటీ తెచ్చుకుంది. అతి తక్కువ టైంలోనే చాలా పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ పంచ్ వేస్తే ఎలాంటి వారైనా కడుపుబ్బ నవ్వాల్సిందే . కానీ వాటిలో ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి.

Jabardasth Faima getting this much remuneration in Bigg Boss Telugu 6
Jabardasth Faima

అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం హౌస్ లోకి వెళ్లే ముందు ఫైమాకు షాకింగ్ కండిషన్ పెట్టిందట. కచ్చితంగా ఆమె హౌస్ లో ఒకరితో క్లోజ్ గా మూవ్ అవ్వాలని అప్పుడే ఆమె ఎక్కువ కాలం హౌస్ లో ఉండగలదని. అంతేకాదు జబర్దస్త్ ఎక్స్ కమెడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడాలని ఒక కండిషన్ పెట్టారట. ఇలా చేస్తే బిగ్ బాస్ ఫైమా కు దాదాపు వారానికి రూ.50,000 ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఆల్రెడీ ఓ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నట్టు స్టేజి పైనే చెప్పింది. లాస్ట్ సీజన్లో షణ్ముఖ, దీప్తి సునైనాను విడదీసినట్లు ఈ సీజన్లో ప్రవీణ్, ఫైమాను విడదీస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి