Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ సీజ‌న్ 6కు నాగార్జున ఎంత తీసుకుంటున్నారో తెలుసా ?

August 11, 2022 9:05 PM

Bigg Boss Telugu 6 : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ఇప్పటి వరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవ‌లే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో బిందు మాధవి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఓటీటీలో బిగ్ బాస్ షో నాన్ స్టాప్ గా 24 గంటలు అందరినీ మెప్పించింది. ఇటీవల విడుదలైన బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో కూడా అదిరిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా పాపులర్ యాంకర్ ఉదయభాను, హీరో నందు, చలాకీ చంటి, జబర్దస్త్ అప్పారావు, శ్రీ హాసన్, చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ వంటి పాపులర్ సెలబ్రిటీస్ ఈ బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్‌ చేయబోతున్నారు.

Bigg Boss Telugu 6 do you know about Nagarjuna remuneration
Bigg Boss Telugu 6

ఈ ఆగస్టు చివరి వారంలో గానీ సెప్టెంబర్ మొదటి వారంలో గానీ సీజన్ 6 ప్రారంభం కాబోతోందని సమాచారం. సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్స్ కూడా భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి హోస్ట్ నాగార్జునపై పడింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

గత సీజన్ లో నాగార్జున షో మొత్తానికి రూ.12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా, ఇప్పుడు తాజాగా రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 కోసం నాగార్జున ఏకంగా రూ.15 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చార‌మే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now