Ileana : సెల్ఫీల‌తో ఇలియానా ర‌చ్చ రచ్చ‌.. మ‌తులు పోతున్నాయ్‌..!

June 19, 2022 7:00 PM

Ileana : దేవ‌దాసు సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఇలియానా. గోవాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే గ్లామ‌ర్ షో చేసింది. అంతేకాదు తొలి సినిమానే హిట్ కావ‌డంతో న‌క్క తోక తొక్కిన‌ట్లు అయింది. దీంతో ఈమెకు తెలుగులో ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌చ్చాయి. త‌రువాత పోకిరి సినిమాతో ఈమె వెంట‌నే రెండో హిట్‌ను అందుకుంది. ఇక ఆ త‌రువాత ఇలియాన వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌ను ఎన్నో ఏళ్ల‌పాటు ఏలింది. అప్ప‌ట్లోనే రూ.1 కోటి పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా ఇలియానా పేరుగాంచింది. అయితే ఆమె బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాల‌ను న‌మోదు చేసింది. కానీ ల‌వ్ వ‌ల్ల ఈమె కెరీర్ మొత్తం నాశ‌నం అయింది.

బాలీవుడ్‌లో పీక్ స‌మ‌యంలో ఉన్న వేళ ఇలియానా ల‌వ్ కార‌ణంగా వ‌చ్చిన అవ‌కాశాల‌ను వ‌దులుకుంది. దీంతో ల‌వ్‌లో అయినా ఈమె స‌క్సెస్ అవుతుంద‌ని అనుకున్నారు. కానీ ల‌వ్ బ్రేక‌ప్ అయింది. దీంతో డిప్రెష‌న్‌లోకి వెళ్లిన ఈమె చాలా లావుగా కూడా అయింది. అయితే ఆ త‌రువాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె పూర్తిగా మారిపోయింది. లావుగా ఉన్న కార‌ణంగా అవ‌కాశాలు మ‌ళ్లీ రాలేదు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఇలియానా చేస్తున్న సంద‌డి మామూలుగా ఉండ‌డం లేదు. ఈమె వ‌రుస‌గా అందులో ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది.

Ileana latest black color dress photos viral
Ileana

ఇప్ప‌టికే ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న బికినీ ఫొటోల‌ను ఎన్నింటినో షేర్ చేసింది. తాజాగా మ‌రోమారు సెల్ఫీల‌తో రెచ్చిపోయింది. ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఇలియానా దిగిన సెల్ఫీల‌ను చూస్తుంటే మ‌తులు పోతున్నాయి. కుర్ర‌కారు ఈమె గ్లామ‌ర్ షోను చూసి మైమ‌రిచిపోతున్నారు. అయితే సోష‌ల్ మీడియాలో ఇంత గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తున్నా ఇలియానాకు మాత్రం అవ‌కాశాలు రావ‌డం లేదు. మ‌రి భ‌విష్య‌త్తులో అయినా ఈమె ట్రాక్‌లోకి ఎక్కుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now