Ileana : హాస్పిట‌ల్ బెడ్‌పై సెలైన్ల‌తో ప్ర‌త్య‌క్షం అయిన ఇలియానా.. అస‌లేం జ‌రిగింది..?

January 31, 2023 7:47 AM

Ileana : హీరోయిన్ల లైఫ్ అంటేనే అంత‌. అవ‌కాశాలు వ‌చ్చి సినిమాలు హిట్ అయితే స్టార్ స్టేట‌స్‌ను సొంతం చేసుకుంటారు. కానీ ఆ స్టేట‌స్ ఎంతో కాలం ఉండదు. నాలుగు ఫ్లాప్‌లు ప‌డితే చాలు.. హీరోయిన్ల‌ను ఎవ‌రూ చూడ‌రు. ఇలా తెర‌మ‌రుగు అయిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అయితే కొంద‌రు మాత్రం త‌మ కెరీర్‌ను అన‌వ‌స‌రంగా నాశ‌నం చేసుకున్నారు. అలాంటి వారిలో ఇలియానా ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఈమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే అక్క‌డ నిల‌దొక్కుకోవాల్సింది పోయి ల‌వ్ అంటూ ప‌రుగెత్తింది. కానీ అక్క‌డ బోల్తా కొట్టింది. దీంతో అటు ప్రేమ‌లో విఫ‌లం అవ‌డ‌మే కాక‌.. ఇండ‌స్ట్రీకి కూడా దూర‌మైంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె ఉంది. అయితే ఇలియానా తాజాగా హాస్పిట‌ల్ బెడ్‌పై క‌నిపించే సరికి అంద‌రూ షాక‌వుతున్నారు. ఆమెకు ఏమైంది.. అంటూ ఆరా తీస్తున్నారు.

గోవా బ్యూటీ ఇలియానా సినిమాల‌కు దూరం అయ్యాక ల‌వ్‌లో బ్రేక‌ప్ అయ్యి చాలా కాలం పాటు మీడియా ముందుకు రాలేదు. కానీ ఈ మ‌ధ్య కాలంలో ఈమె మ‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే అది సోష‌ల్ మీడియా ద్వారా. అందులో త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. అయితే ఎక్కువ‌గా విదేశాల‌కు ట్రిప్పులు వేస్తున్న ఈ భామ తాజాగా ఓ చోట అస్వస్థ‌త‌కు గురైంది. దీంతో వెంట‌నే హాస్పిట‌ల్ లో చేరింది. త‌న‌కు మూడు సెలైన్ బాటిల్స్ ఎక్కించార‌ని చెప్పింది. అయితే త‌న‌కు ఏం జ‌రిగింది.. అన్న విష‌యాల‌ను మాత్రం ఆమె వెల్ల‌డించ‌లేదు. దీంతో బ‌హుశా ఆమెకు ఫుడ్ పాయిజ‌నింగ్ అయి ఉండ‌వ‌చ్చు.. అని అంద‌రూ అనుకుంటున్నారు. ఇక ఇలియానా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమెకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో వాటికి ఆమె స్పందించింది.

Ileana suddenly appeared on hospital bed what happened
Ileana

తాను కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న అంద‌రికీ థ్యాంక్స్ చెప్పింది. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ అంతా నార్మల్ అవుతుంద‌ని.. మ‌ళ్లీ మీ ముందుకు వ‌స్తాన‌ని తెలియ‌జేసింది. ఇక ఇలియానా ల‌వ్ బ్రేక‌ప్ అయ్యాక తీవ్ర‌మైన డిప్రెష‌న్‌కు గురైంది. దీంతో విప‌రీతంగా లావైంది. ఆ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు చేజారిపోయాయి. అయితే ఆ త‌రువాత కొన్ని సినిమాలు చేసినా.. అవి పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో ఇల్లీ బేబీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆమె తెలుగులో చివ‌రిసారిగా ర‌వితేజ‌తో క‌లిసి అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోని చిత్రంలో న‌టించింది. ఆ మూవీ ఫ్లాప్ అవ‌డంతో ఆమెకు తెలుగులోనూ అవ‌కాశాలు క్లోజ్ అయ్యాయి. ఇక ఇల్లీ బేబీ ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now