గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Sonu Sood : అతడు సినిమాలో సోను సూద్ పాత్రని చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Sonu Sood : మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన చిత్రం అత‌డు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. త‌న‌దైన శైలిలో త్రివిక్ర‌మ్ ఈ మూవీని ముందుండి…

Sonu Sood : అతడు సినిమాలో సోను సూద్ పాత్రని చేతులారా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Sonu Sood : మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన చిత్రం అత‌డు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. త‌న‌దైన శైలిలో త్రివిక్ర‌మ్ ఈ మూవీని ముందుండి న‌డిపించారు. అలాగే మ‌హేష్ యాక్ష‌న్ కూడా అదిరిపోయింది. ఈ సినిమాలో ఫైట్స్ కూడా ప్రేక్షకులకు బాగా న‌చ్చేశాయి. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులతో విజిల్స్ వేసేలా ఆకట్టుకుంది అతడు చిత్రం. మరి ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ మిస్ చేసుకున్నారు.

మొట్టమొదటిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా కథను ఉదయ్ కిర‌ణ్ తో చేయాలనుకున్నాడట. కానీ ఆ సమయంలో చిరంజీవి కూతురుతో ఉద‌య్ కిర‌ణ్ నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పటి నుంచి అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ చూసుకునేవారు. అల్లు అరవింద్ ఈ సినిమా ఉదయ్ కిరణ్ కి సెట్ కాదని రిజెక్ట్ చేయడంతో అతడు సినిమాని ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపారట. కానీ పవన్ కూడా ఈ కథను రిజెక్ట్ చేయటం జరిగింది.

do you know who missed Sonu Sood character in Athadu movie
Sonu Sood

దాంతో త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబుకు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా  ఈ సినిమాలో నాజర్ చేసిన పాత్ర కోసం మొదట శోభన్ బాబును అనుకున్నారట. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలు చేయకూడదని నిర్ణయించుకోవడంతో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం అతడు చిత్రంపై మరొక విషయం వినిపిస్తోంది.

అతడు చిత్రంలో సోనూసూద్ పాత్ర కోసం త్రివిక్రమ్ తనను సంప్రదించాడ‌ని వేణు తొట్టెంపూడి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. కానీ వేణు తొట్టెంపూడి ఈ సినిమా చేయనని త్రివిక్రమ్ తో చెప్పినట్టు తెలిపారు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి పాత్రలు ఆఫ‌ర్ చేశాడ‌ని, కానీ తానే రిజెక్ట్ చేశానని వేణు ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి