Sonu Sood : సోనూసూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? దిమ్మ తిరిగి పోతుంది..!

September 13, 2022 3:05 PM

Sonu Sood : సోనూసూద్ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సిల్వర్‌ స్ర్కీన్‌పై విలన్‌ వేషాలు వేసినా నిజజీవితంలో మాత్రం రియల్‌ హీరోగా గుర్తింపు పొందాడు. కరోనా కాలంలో అడిగిందే తడవుగా ఎంతోమందికి ఆపన్న హస్తం అందించాడీ టాలెంటెడ్‌ యాక్టర్‌. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు సోనూసూద్‌. అందుకే అతనికి దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు తోడయ్యారు.

ప్రజలకు నిత్యం సాయం చేసేందుకు సూద్ ఛారిటీ కూడా నెలకొల్పారు. సోనూ మంచి మనసు చూసి ఆయన ఛారిటీకి కొందరు దాతలు విరాళాలు ఇచ్చారు. సోనూసూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంగీకరించిన చిత్రాలు పూర్తయిన తరువాత సోనూసూద్ హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తారేమో చూడాలి. అయితే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు సోనూసూద్.

do you know the value of Sonu Sood assets
Sonu Sood

ఈ క్రమంలో ప్రజల కోసం బోలెడు డబ్బు ఖర్చు చేస్తున్న సోనూసూద్ ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సోనూ సూద్ కెరీర్ మొదటి నుండి అన్ని భాషల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొన్ని బ్రాండ్లకు వ్యవహరిస్తున్నాడు. వాటితో పాటు రెస్టారెంట్ వ్యాపారం కూడా సోనూకు ఉన్నట్టు తెలుస్తోంది.

అలా కష్టపడుతూనే సోనూసూద్ మొత్తం రూ.130 కోట్ల వరకు ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ఆచార్య సినిమాలో చివరిగా కనిపించాడు సోనూసూద్‌. ఆ తర్వాత చాంద్‌ బార్దాయ్‌ అనే చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం తమిళ్‌తో పాటు మరికొన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now