Sonu Sood : అరెరే.. ఎస్కలేటర్ ఇలా కూడా దిగుతారా.. ఫన్నీ వీడియో షేర్ చేసిన సోనూ సూద్..

September 3, 2022 12:27 PM

Sonu Sood : సోనూ సూద్.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సోనూ సూద్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో విలన్ పాత్రల్లో భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఎందరికో సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరును చూసి తెరపై ఆయనను చూసి భయపడ్డవారే ఆనందంతో అభినందనలు తెలిపారు. రీల్ పై విలన్.. రియల్ లైఫ్ లో హీరో అంటూ కొనియాడారు.

ప్రజలకు నిత్యం సాయం చేసేందుకు సూద్ ఛారిటీని కూడా నెలకొల్పారు. సోనూ మంచి మనసు చూసి, ఆయన ఛారిటీకి కొందరు దాతలు విరాళాలు ఇచ్చారు. సోనూ సూద్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎందరో ఆయన హీరోగా సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అంగీకరించిన చిత్రాలు పూర్తయిన తరువాత సోనూ సూద్ హీరోగా సినిమాలు చేస్తూ అలరిస్తారేమో చూడాలి. సోనూ సూద్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సోనూ సూద్ ఓ వీడియోను షేర్ చేశాడు.

Sonu Sood shared his funny video viral
Sonu Sood

అందులో సోనూ సూద్ ఎస్కలేటర్‌ను వింతగా వాడేశాడు. ఎస్కలేటర్‌లో ఎలా నిలబడతారు.. ఎలా కిందకు వస్తారో.. ఎలా దిగుతారో అందరికీ తెలిసిందే. కానీ సోనూ సూద్ మాత్రం కాళ్ల మీద నిలబడ లేదు. చేతుల మీద బ్యాలెన్స్ చేసుకున్నాడు. కాళ్లను గాలిలోనే ఉంచాడు. ఇక చివర్లో చిన్నగా జంప్ చేసేశాడు. మొత్తానికి సోనూ సూద్ తనలోని చిన్న పిల్లాడిని ఇలా బయటకు తీశాడు. అది చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అరెరే.. ఎస్కలేటర్ ఇలా కూడా దిగుతారు అని తెలీక మేము మాములుగా దిగాము అంటూ నెటిజ‌న్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now