Sonu Sood : మ‌రో గొప్ప ప‌ని చేసిన సోనూసూద్‌.. శ‌భాష్ అంటున్న నెటిజ‌న్లు..

September 12, 2022 6:45 PM

Sonu Sood : సోనూసూద్ పేరుకు పరిచయం అక్కర్లేదు. సోనూసూద్ కి దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో విలన్ పాత్రల్లో భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో మాత్రం ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఎందరికో సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా కల్లోల సమయంలో ఎంతోమందిని సోనూ ఆదుకున్న తీరు చూసి, తెరపై ఆయనను చూసి భయపడ్డవారే ఆనందంతో అభినందనలు తెలిపారు. రీల్ పై విలన్.. రియల్ లైఫ్ లో హీరో అంటూ కొనియాడారు. ప్రజలకు నిత్యం సాయం చేసేందుకు సూద్ ఛారిటీని కూడా నెలకొల్పారు.

సోనూ సూద్‌ అంతులేని సేవా కార్యక్రమాల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ఐఏఎస్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్‌ ఇవ్వనున్నారు. గతేడాది ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ని ప్రారంభించారు సోనూసూద్‌. దాంట్లో భాగంగా ఈ ఏడాదికి కూడా కోచింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్‌), డివైన్‌ ఇండియా యూత్‌ అసోసియేషన్ (డీఐవైఏ)ల సహకారంతో ఈ ఏడాదికిగాను సంభవం స్కాలర్‌షిప్‌ అనే కొత్త సెషన్‌ని ఆయన ప్రారంభించారు.

Sonu Sood started free IAS coaching for poor students
Sonu Sood

సంభవం అనేది ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రూపొందించిన కార్యక్రమం. సోనూసూద్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలోని టాప్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్లలో ఉచితంగా ఆన్‌ లైన్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ని పొందుతారు. మెంటర్‌షిప్‌ సపోర్ట్ ని, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, యువత సాధికారత ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ ఐఏఎస్‌ కావాలనుకునే పేద వారికి సమాన అవకాశాలు, సరైన జ్ఞానం అందించాలనేది మా ఉద్దేశ్యం అని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now