Disha Patani : దిశా ప‌టానీని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. ఎందుకంటే..?

December 3, 2021 10:13 PM

Disha Patani : మోడ‌ల్ స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న దిశా ప‌టానీ అడ‌పా ద‌డ‌పా సినిమాల్లోనూ న‌టిస్తోంది. ఈమె న‌టించిన సినిమాలు బాలీవుడ్‌లో హిట్ అవుతున్నాయి. కానీ ఇత‌ర భాష‌ల్లో ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోషూట్స్‌, బ్రాండ్స్‌ను ప్ర‌మోట్ చేయ‌డంలో ఈ భామ బిజీగా ఉంటుంది. అందులో భాగంగానే సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ త‌న ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది.

Disha Patani latest dress photos viral netizen troll her

కాగా దిశా ప‌టానీ ప్ర‌స్తుతం ట్రోల్స్‌కు గుర‌వుతోంది. కార‌ణం.. ఆమె ధ‌రించిన డ్రెస్సే అని చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కుమారుడు అహ‌న్ శ‌ట్టి, తారా సుతారియా న‌టించిన త‌డ‌ప్ మూవీకి గాను ఇటీవ‌లే ముంబైలో సెల‌బ్రిటీల‌కు ప్ర‌త్యేక షో వేశారు. ఆ షోకు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఇక దిశా ప‌టానీ కూడా వ‌చ్చింది. కానీ ఆమె రెచ్చ‌గొట్టే డ్రెస్ వేసుకుని ఆ షో కు హాజ‌రైంది. దీంతో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CW-y6e4svcI/?utm_source=ig_embed&ig_rid=898eff76-aed2-4248-a4c4-1b16a076c80d

దిశా ప‌టానీ చ‌క్క‌ని ఫిగ‌ర్‌. ఒంపు సొంపులు అన్నీ క‌రెక్ట్ కొల‌త పెట్టి కొలిచిన‌ట్లు ఉంటాయి. దీంతో ఆమె ధ‌రించిన డ్రెస్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ క్ర‌మంలోనే ఆమె అలాంటి డ్రెస్ ను ధ‌రించ‌డంతో నెటిజ‌న్లు త‌మ నోళ్ల‌కు ప‌నిచెప్పారు. ఈ డ్రెస్‌లో నీకు చ‌లి వేయ‌డం లేదా.. అని కొంద‌రు కామెంట్లు చేయ‌గా.. ఆమె ఇప్పుడే బెడ్ మీద నుంచి లేచి ఈవెంట్‌కు వ‌చ్చిన‌ట్లుంది.. అని కొంద‌రు కామెంట్లు చేశారు.

https://www.instagram.com/reel/CW8wEXgqf9n/?utm_source=ig_embed&ig_rid=52f9b70c-cf2c-4cbb-9e57-8e82e8ce3abe

హీరోయిన్లు, ఇలాంటి మోడ‌ల్స్ ను ట్రోల్ చేయ‌డం కొత్తేమీ కాదు. అందులోనూ కొంచెం గ్లామ‌ర్ డ్రెస్‌ల‌ను ధ‌రించే వారికి ట్రోల్స్ ఎక్కువ‌గానే వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే దిశా ప‌టానీ కూడా ట్రోలర్స్ బారిన ప‌డింది. కాగా ఆమె ధ‌రించిన ఆ డ్రెస్ తాలూకు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment