Disha Patani : అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం అంటున్న దిశా ప‌టాని..!

July 21, 2022 6:56 PM

Disha Patani : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఆయ‌న‌కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి అనేక ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ మేక‌ర్స్ పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే పుష్ప సినిమా అనంత‌రం ఆయ‌న నేరుగా హిందీ మూవీలోనే న‌టిస్తార‌ని అంటున్నారు. ఇక ప్ర‌స్తుతం పుష్ప 2 కు గాను ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ త‌న గెట‌ప్‌ను కాస్త మార్చ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. దీంతోపాటు మొద‌టి పార్ట్‌లో వ‌చ్చిన త‌గ్గేదేలే డైలాగ్‌కు బ‌దులుగా ఇంకో డైలాగ్‌ను సెకండ్ పార్ట్‌లో పెట్ట‌నున్నార‌ట‌. ఇక అల్లు అర్జున్ గురించి బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టాని కీల‌క‌వ్యాఖ్య‌లు చేసింది.

అల్లు అర్జున్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని.. ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్ ని అని దిశా ప‌టాని తెలిపింది. తాను సినిమాల్లోకి రాక ముందు నుంచే అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ ని అని తెలియ‌జేసింది. ఈ క్ర‌మంలోనే దిశా కామెంట్స్‌కు నెటిజ‌న్లు కొత్త అర్థాలు వెతుకుతున్నారు. వాస్త‌వానికి పుష్ప మొద‌టి పార్ట్‌లోనే దిశా న‌టించాల్సి ఉంది. స‌మంత చేసిన ఊ అంటావా పాట కోసం ముందుగా దిశా ప‌టానినే అనుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ కుద‌ర‌లేదు. దీంతో ఆ చాన్స్ ను స‌మంత కొట్టేసింది. ఇక ఆ పాట ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో ఒక గొప్ప చాన్స్‌ను దిశా కోల్పోయిన‌ట్లు అయింది.

Disha Patani says she likes Allu Arjun very much
Disha Patani

అయితే పుష్ప 2లో దిశా ప‌టానినే స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ క‌న్‌ఫామ్ కూడా చేశారు. ఇక దిశా ప‌టాని తెలుగులో లోఫ‌ర్ సినిమాతో టాలీవుడ్‌కు, అటు సినిమా ఇండ‌స్ట్రీకి కూడా ప‌రిచ‌యం అయింది. కానీ త‌రువాత ఈమె తెలుగులో మూవీలు చేయ‌లేదు. బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. స‌క్సెస్ అయింది. అక్కడే మూవీల్లో న‌టిస్తోంది. ఇక ప్ర‌భాస్, దీపికా ప‌దుకునెలు న‌టిస్తున్న ప్రాజెక్ట్ కెలో ఈమె సెకండ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now