Disha Patani : మ‌మ్మల్ని చెడ‌గొట్టినందుకు థ్యాంక్స్.. ప్ర‌భాస్‌పై దిశా ప‌టాని కామెంట్స్‌..!

May 10, 2022 12:44 PM

Disha Patani : తెలుగు ప్రేక్ష‌కుల‌కు దిశా ప‌టాని ప‌రిచ‌య‌మే. ఈ అమ్మ‌డు త‌న సినీ కెరీర్‌ను తెలుగు సినిమాతోనే ప్రారంభించింది. లోఫ‌ర్ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. అయితే ఆ ఒక్క మూవీతోనే ఆమె అక్క‌డితో ఆగిపోయింది. తెలుగులో మ‌ళ్లీ సినిమాలు చేయ‌లేదు. బాలీవుడ్‌కే ప‌రిమితం అయింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ తెలుగు ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్ కె లో దిశా న‌టించ‌నుంది. ఈ మూవీతో ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రోమారు సిద్ధ‌మ‌వుతోంది. ఇక తాజాగా ఈమె చిత్ర యూనిట్‌తో క‌లిసింది. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఈమెకు చిత్ర యూనిట్ పూల బొకేల‌తో ఘ‌న స్వాగతం ప‌లికింది.

Disha Patani said thanks to Prabhas for sending home food
Disha Patani

ఈ మూవీని వైజ‌యంతి మూవీస్ నిర్మిస్తుండ‌గా.. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ ప‌క్క‌న దీపికా ప‌దుకునే హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమాలో దిశా పటాని ఐట‌మ్ సాంగ్ చేస్తుంద‌ని టాక్‌. అందుక‌నే ఈమె హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ సంద‌ర్బంగా ఇప్ప‌టికే ప్ర‌భాస్ చిత్ర యూనిట్‌కు అద్భుత‌మైన వంట‌కాల‌ను పంపి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, దీపికాల‌కు ప్ర‌భాస్ పంపిన తెలుగు వంట‌కాలు ఎంత‌గానో న‌చ్చాయి. వారు గ‌తంలో ప్ర‌భాస్ ఇచ్చిన విందుకు ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌భాస్ ఇప్పుడే కాదు.. త‌న సినిమా షూటింగ్ ఏదైనా స‌రే చిత్ర యూనిట్‌కు ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తుంటారు. అవి తింటే డైట్ చేసేవారు అంతా మ‌ర్చిపోతారు. అన్నీ లాగించేస్తారు. ఇక దిశా ప‌టానికి కూడా ప్ర‌భాస్ అలాగే అన్ని ర‌కాల ఫుడ్ ఐట‌మ్స్ తెప్పించారు.

ప్ర‌భాస్ స్వ‌త‌హాగా భోజ‌న ప్రియుడు. క‌నుక తోటి న‌టీన‌టుల‌కు ఆయన తాను తినే ఫుడ్స్‌ను తెప్పిస్తుంటారు. ఇంట్లోనే స్వ‌యంగా వండించి తెప్పిస్తారు. దిశాప‌టానికి కూడా అలాగే తెప్పించారు. అయితే దిశా ఫిట్‌నెస్ విష‌యంలో చాలా క‌ఠినంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే త‌న ఫిట్‌నెస్‌ను చెడ‌గొట్టినందుకు థ్యాంక్స్‌.. అని ప్ర‌భాస్‌పై దిశా ప‌టాని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ప్ర‌భాస్ త‌రువాత ఆది పురుష్‌, స‌లార్ చిత్రాల‌తో ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది సంద‌డి చేయ‌నున్నారు. త‌రువాత ప్రాజెక్ట్ కె రిలీజ్ కానుంది. ఈ మూవీ సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now