Disha Patani : తెల్లని దుస్తుల్లో దిశా పటాని పరువాల ప్రదర్శన.. నాజూకు అందాలతో స్టన్నింగ్ స్టిల్స్..

September 16, 2022 7:33 PM

Disha Patani : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది దిశా పటాని. మొదటి సినిమాతోనే తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో కనిపించలేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం మంచి గ్లామర్ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. అక్కడ క్రేజీ ఆఫర్స్ అందికుంటున్న దిశా పటాని.. ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కలిసి నటించే అవకాశం అందుకుంది.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టు కె లో దిశా పటానీ కూడా ఓ పాత్రలో నటించనుంది. అలాగే తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న సూర్య 42లోనూ హీరోయిన్ గా ఎంపికైంది. సౌత్ లో భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ కేరీర్ లో దూసుకుపోతోంది. అయితే ఇటు సినిమాల పరంగా జోరు పెంచుతున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. పొట్టి డ్రెస్సులో నాజూకు అందాలను విందు చేస్తూ నెటిజన్ల మతిపోగొడుతోంది. హాట్ లుక్ లో ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

Disha Patani attended awards function photos viral
Disha Patani

తాజాగా ఫిల్మ్ ఫేర్ 2022 కోసం తెల్లటి పేలిక దుస్తుల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ కాస్ట్యూమ్ లోనే క్రేజీగా ఫొటోషూట్ చేసింది. తాజాగా ఆ ఫోటోలను తన అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పొట్టి డ్రెస్సులో యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు అభిమానులు, నెటిజన్లు మంత్ర ముగ్ధులవుతున్నారు. క్రేజీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన హిందీ ఫిల్మ్ యోధా రిలీజ్ కు సిద్ధమవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now