Anushka Sharma : వామ్మో.. అనుష్క శ‌ర్మ ఏంటి.. ఇలా రెచ్చిపోయింది..!

June 12, 2022 3:11 PM

Anushka Sharma : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా పేరుగాంచిన అనుష్క శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న త‌రువాత సినిమాల్లో న‌టించ‌డం త‌గ్గించింది. సొంతంగా సినిమాల‌ను నిర్మిస్తోంది. మ‌రోవైపు కుమార్తె వామికాను కూడా చూసుకుంటోంది. అయితే వివాహం అయి ఒక బిడ్డ‌కు త‌ల్లి అయిన‌ప్ప‌టికీ ఈమెలో గ్లామ‌ర్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. గ‌తంలో వివాహం కాక ముందు.. సినిమాల్లో.. బ‌య‌ట గ్లామ‌ర్ షో చేసింది. కానీ ఇప్పుడు త‌గ్గింది. అయితే ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ ఈమె యాక్టివ్ అయింది. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ అల‌రిస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు యువ‌త‌కు కిక్ ఎక్కిస్తున్నాయి.

విరాట్ కోహ్లి స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ తాజాగా ఆరెంజ్ క‌ల‌ర్ బికినీలో అద‌ర‌గొట్టింది. బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది. వాటిల్లో ఈమె అందాలు అద‌ర‌హో అనిపించేలా ఉన్నాయి. గ్లామ‌ర్ షో చేయ‌డం ఈమెకు కొత్తేమీ కాదు. కానీ తాజాగా షేర్ చేసిన ఫొటోలు మాత్రం చాలా వైవిధ్య‌భ‌రితంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈమె వివాహం చేసుకున్న త‌రువాత మ‌ళ్లీ ఈ మ‌ధ్య కాలంలోనే ఎక్కువ‌గా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తోంది. దీంతో ఈమె మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తుందా.. అందుక‌నే ఇలా చేస్తుందా.. అని చ‌ర్చించుకుంటున్నారు.

Anushka Sharma busy with film shootings
Anushka Sharma

ఇక అనుష్క శ‌ర్మ ప్ర‌స్తుతం మై: ఎ మ‌ద‌ర్స్ రేంజ్‌, చ‌క్దా ఎక్స్ ప్రెస్‌, ఖాలా వంటి సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన చ‌క్దా ఎక్స్‌ప్రెస్‌లో ఈమె ఝుల‌న్ గోస్వామి పాత్ర‌లో న‌టించింది. ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఈమె రెగ్యుల‌ర్ మూవీల్లో ఎప్పుడు న‌టిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment