Anushka Sharma : బేబీ పుట్టాక నా శరీరం చాలా మారింది..!

November 13, 2021 3:33 PM

Anushka Sharma : ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళకు ఉంటుంది. అలాగే వారి లైఫ్ లో అమ్మ అనే మధురమైన మూమెంట్స్ ఉంటాయి. ప్రతి తల్లికి అమ్మ అవ్వడం అనేది పునః జన్మ లాంటిది. ఎన్నో ఎమోషన్స్ తో ముడిపడిన ఓ అందమైన అనుబంధం. అందులోనూ మహిళలు తల్లి అయ్యాక మానసిక, శారీరక మార్పులకు గురవుతారు.

Anushka Sharma said her body changed after giving birth to a baby

2021లో బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ తన మొదటి బేబీ వామికకు జన్మనిచ్చాక.. తన లైఫ్ లో జరిగిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాల్ని షేర్ చేసుకుంది. అనుష్క పోస్ట్ ప్రెగ్నెన్సీ బాడీ చేంజ్ గురించి తన భయాన్ని షేర్ చేసుకుంది. తన శరీరం గురించి ఆలోచించేదాన్ని అని.. అలా దాన్ని ద్వేషించడం ప్రారంభిస్తే ఎంతో భయానికి గురయ్యేదాన్నని.. అన్నారు.

ఈ విషయంలో తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు తన ఫ్రెండ్ తో డిస్కస్ చేశారట. అలా తనకు ప్రెగ్నెన్సీ రాకముందు, అలాగే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎంతోమంది తల్లుల లాగానే తాను కంగారు పడినట్లు చెప్పింది. అలాగే తన శరీరాన్ని ద్వేషిస్తానా.. అనే ఆలోచనలు తనను డిప్రెషన్ కు గురిచేసేవట.

సాధారణంగా మనకు తెలిసినట్లుగా అనుష్క తన ప్రెగ్నెన్సీని ఫిట్ గా ఉండేలా చూసుకున్నారట. అలా అనుష్క శర్మ ఎంతో మంది తల్లులకు స్పూర్తిగా నిలిచింది. ఆరోగ్యకరమైన ఆహారం దగ్గర్నుండి, వ్యాయామం, యోగా లాంటివి నిత్యం చేస్తూ.. కాబోయే అమ్మలకు రోల్ మోడల్ గా నిలిచింది.

నా శరీరం ఇంతకు ముందులా లేదు, అయినా కూడా ఫిట్ గా ఉండటానికి ఇష్టపడతాను కనుక ఆ దిశగా కృషి చేస్తానని అంటున్నారు. ఇక ప్రజంట్ అనుష్క శర్మ గతంలో కంటే ఇప్పుడు తన స్కిన్ విషయంలో మరింత కంఫర్ట్ గా ఉన్నట్లు తెలిపింది. జీవితంలో ఏదైనా మన మానసిక పరిస్థితి పైనే ఆధారపడి ఉంటుందని.. మనం మనసుతో ఎలా అయితే చూస్తామో అలాగే కనిపిస్తారనే విషయాన్ని తాను చాలా స్పష్టంగా తెలుసుకోగలిగానని అన్నారు.

అయితే ఇది చాలా స్ట్రాంగ్ మూమెంట్ అని.. అందరూ తమ శరీర తత్వాన్ని అంగీకరించాలని అనుష్క అన్నారు. మనం ఎప్పుడూ మహిళల్లా భావించాలని.. లైఫ్ లో వచ్చే ప్రతి మూమెంట్ ని ఆస్వాదించగలగాలని అనుష్క తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment