Vamika: విరాట్‌- అనుష్క కూతురిని చూశారా.. అచ్చం తండ్రి పోలిక‌ల‌తోనే ఉంది..!

December 17, 2021 11:22 AM

Vamika : విరాట్ – అనుష్క‌ల ముద్దుల కూతురు వామిక ఈ ఏడాది జ‌న‌వ‌రి 11న జ‌న్మించిన విష‌యం తెలిసిందే. పుట్టిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు కూతురి ఫేస్ ఎక్క‌డా రివీల్ కాకుండా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఈ రోజు టీమిండియా సౌతాఫ్రికా టూర్‌కి వెళుతున్న నేప‌థ్యంలో అనుష్క బ‌స్ నుండి కింద‌కు దిగే క్ర‌మంలో ఫొటోగ్రాఫ‌ర్స్ అనుష్క చేతిలో ఉన్న వామిక‌ను త‌మ కెమెరాలో బంధించారు.

did you see Vamika of virat kohli anushka sharma daughter

ప్ర‌స్తుతం వామిక‌ని చూసి అంద‌రూ విరాట్ కోహ్లీ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెండు పిల‌క‌లు వేసుకొని బొద్దుగా, ముద్దుగా ఉన్న చిన్నారిని చూసి అనుష్క‌, కోహ్లీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ప్ర‌స్తుతం వామిక పిక్స్ వైర‌ల్‌గా మారాయి. డిసెంబరు 26 నుంచి సఫారీ గడ్డపై మూడు టెస్టులు, జనవరి 19 నుంచి మూడు వన్డేల సిరీస్‌ని ఆడనున్న భారత్ గత మూడు రోజులుగా ముంబయిలో క్వారంటైన్‌లో ఉంది.

ఈ క్వారంటైన్ సమయంలో భారత క్రికెటర్లతోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. దాంతో.. ఈరోజు ఉదయం ఛార్టర్డ్‌ ప్లైట్‌లో టీమ్ బయల్దేరి వెళ్లింది. ఇదిలా ఉంటే వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి (దుర్గాదేవి) మరోపేరు అది. స్త్రీ, పురుష సమానత్వం ప్రతిబింబించే పేరు వామిక. అర్ధనారీశ్వర రూపంలో శివుడు కుడి వైపు ఉంటే.. ఎడమ వైపు పార్వతి దేవి ఉంటారు. ఎడమ అంటే వామ అని అర్థం. అందుకే పార్వతిని వామిక అంటారు. విరాట్​ – అనుష్క పేర్లు కలిసేలా కూడా ఈ పేరు ఉండడం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now