Vamika : విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌ల కుమార్తె ఎలా ఉందో చూశారా ? స్ప‌ష్ట‌మైన ఫొటో..!

January 25, 2022 11:18 AM

Vamika : భార‌త్, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఇటీవ‌లే కేప్‌టౌన్‌లో మూడో వ‌న్డే జ‌రిగిన విష‌యం విదిత‌మే. అయితే అందులోనూ భార‌త్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 3-0తో కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే టీమిండియాపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శ‌లు చేస్తున్నారు. కేఎల్ రాహుల్ స‌రైన జట్టును ఎంచుకోలేక‌పోయాడ‌ని, జ‌ట్టును ముందుండి న‌డిపించ‌డంలో విఫలం అయ్యాడ‌ని ఆరోపిస్తున్నారు.

anushka sharma and virat kohli daughter Vamika  clear photo viral

అయితే ఆ మ్యాచ్ సంద‌ర్భంగా అంద‌రి క‌ళ్ల‌న్నీ ఒక చిన్నారిపైనే ప‌డ్డాయి. ఆమే.. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ‌ల కుమార్తె వామికా.. వారికి వామికా గ‌తేడాది జ‌న‌వ‌రి 11వ తేదీన జ‌న్మించింది. అయితే అప్ప‌టి నుంచి ప‌లు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కానీ వాటిల్లో ఎక్క‌డా వామికా ముఖం క‌నిపించ‌కుండా ఆ దంప‌తులు జాగ్ర‌త్త ప‌డ్డారు. కానీ తాజాగా జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా అనుష్క శ‌ర్మ త‌న కుమార్తె ముఖాన్ని క‌వ‌ర్ చేయ‌లేదు. దీంతో కెమెరాల్లో వామికా దృశ్యాలు రికార్డ‌య్యాయి.

ఆ దృశ్యాల్లో వామికాను స్ప‌ష్టంగా వీక్షించ‌వ‌చ్చు. ఇక వామికాకు చెందిన ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో మ‌రోసారి నెటిజ‌న్లు కోహ్లి, అనుష్క దంప‌తుల‌ను విమ‌ర్శిస్తున్నారు. అయితే త‌మ‌కు ప్రైవ‌సీ క‌ల్పించాల‌ని, మీడియా సంస్థ‌లు త‌మ కుమార్తె ఫొటోను ప‌బ్లిష్ చేయొద్ద‌ని కోరుతున్నాం.. అని వారు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికే చాలా వెబ్‌సైట్లు, ప‌త్రిక‌ల్లో వామికా ఫొటోల‌ను అచ్చు వేశారు.

కాగా టీమిండియా త్వ‌ర‌లో వెస్టిండీస్‌తో హోమ్ టూర్‌లో ఆడ‌నుంది. అనంత‌రం శ్రీ‌లంక జట్టు ప‌ర్య‌టిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now