Allu Arjun Sneha Reddy : స్నేహా రెడ్డిని అల్లు అర్జున్‌కు ఇచ్చి చేయ‌డం వెనుక‌.. ఇంత స్కెచ్ ఉందా.. అల్లు అర‌వింద్ తెలివికి హ్యాట్సాఫ్‌..

November 18, 2022 7:50 AM

Allu Arjun Sneha Reddy : తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకు, రాజకీయ నాయకులకు ఎంతో కాలం నుంచి సంబంధం ఉంది. వారు కులాలు, మ‌తాల‌ను ప‌ట్టించుకోరు. అవ‌న్నీ వదిలేసి కులాంతర, మ‌తాంత‌ర‌ వివాహాలు చేసుకున్నారు. ఇప్ప‌టికీ అలాగే కొన‌సాగిస్తున్నారు. ఇక‌ తమకు నచ్చిన అమ్మాయిది ఏ కులమైనా ఏ మ‌త‌మైనా సరే చేసుకుంటూ సినీ ప్రముఖులు చ‌క్క‌ని వాతావరణాన్ని సృష్టించారు. ఇండస్ట్రీలో బడా నిర్మాత అల్లు అరవింద్.. కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఆయన కొడుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు తెరపై స్టార్ హీరోగా ఉన్నారు. వందల కోట్లతో సినిమాలు తీసే అరవింద్ తన కుమారుడికి మాత్రం అతడికి నచ్చిన తెలంగాణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అరవింద్ ఆస్తులతో పోలిస్తే ఆయ‌న‌తో వియ్యం అందుకున్న వ్యక్తి సాధారణ మనిషే అని చెప్ప‌వ‌చ్చు.

అల్లు అర్జున్ కు పిల్లనిచ్చింది కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఈయనకు పలు విద్యాసంస్థలున్నాయి. అంతేకాదు.. టీఆర్ఎస్ రాజకీయ నాయకుడిగా ఎంతో పేరుంది. కేసీఆర్, కేటీఆర్ లకు సన్నిహితుడు. ఆ చొరవతోనే అల్లు అరవింద్, అల్లు అర్జున్ లకు ప్రభుత్వ పరంగా ఏ అవసరం వచ్చినా మామ చంద్రశేఖర్ రెడ్డి ముందుండి తీరుస్తాడట. అందుక‌నే ఈ విధంగా రాజ‌కీయ ప‌ర‌మైన సంబంధాన్ని అల్లు అర‌వింద్ త‌న కుమారుడు అల్లు అర్జున్‌కు చేశార‌ని అనుకోవ‌చ్చు.

Allu Arjun Sneha Reddy marriage allu aravind has master plan behind
Allu Arjun Sneha Reddy

ఇక అల్లు అర్జున్ సినిమా ఫంక్షన్లకు అనుమతులు సహా వివిధ వేడుకలకు ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి చొరవతీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు ఇప్పిస్తాడు. అంతేకాదు.. మామ చెప్పాడని ఓ సారి అల్లు అర్జున్ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. విద్యావేత్తగా విశేష సేవలందిస్తున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. విద్యా ప్రమాణాలు పెంచుతూ పేదలకు ఉచితంగా చదువులు చెప్పడంతో పాటు మంచి విలువైన విద్యాసేవలకు గాను ఈ అవార్డు దక్కింది. తన మామకు అవార్డు దక్కడంతో అల్లు అర్జున్ తోపాటు ఆయన కుతురు స్నేహారెడ్డి సంతోషంగా ఉందట.

పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. ఇలా రాజకీయంగా, సినిమాల పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతూ అల్లు అర్జున్ మామ దూసుకుపోతున్నారు. అయితే రాజ‌కీయ నాయ‌కుల‌తో సినిమా వాళ్ల‌కు అవ‌స‌రం ఎప్పుడూ ఉంటుంది. అందుక‌నే భ‌విష్య‌త్తులో ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా త‌న కుమారుడు పెద్ద‌గా ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఇలా రాజ‌కీయ నాయ‌కుల సంబంధాన్ని అల్లు అర‌వింద్ సెట్ చేశారని అర్థం చేసుకోవ‌చ్చు. ఏది ఏమైనా అర‌వింద్ దూర‌దృష్టికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now