Actress Pragathi : డ్యాన్స్‌తో రెచ్చిపోయిన ప్ర‌గతి.. ఇలా ఎప్పుడూ చేయ‌లేదు.. వీడియో వైర‌ల్‌..!

July 9, 2022 1:17 PM

Actress Pragathi : న‌టి ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్యే ఆమె త‌న బ‌ర్త్‌డేను జ‌రుపుకోగా.. ఆ కార్య‌క్ర‌మానికి అదిరిపోయే డ్రెస్ ధ‌రించి సంద‌డి చేసింది. దీంతో నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ వ‌య‌స్సులో మీకు బ‌ర్త్‌డేలు అవ‌స‌ర‌మా.. అని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌గ‌తి త‌న ప‌నేంటో తాను చేసుకుంటుంది కానీ.. ఎవ‌రు ఏమ‌న్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక సోష‌ల్ మీడియాలో ఈమె చేస్తున్న సంద‌డి మామూలుగా ఉండ‌డం లేదు. అదిరిపోయే డ్యాన్స్‌ల‌తో అల‌రిస్తోంది.

న‌టి ప్ర‌గ‌తి త‌ర‌చూ జిమ్‌లో మ‌న‌కు క‌నిపిస్తూ ఉంటుంది. ఫిట్‌నెస్‌పై ఈమె బాగా దృష్టి పెడుతుంది. క‌నుక‌నే జిమ్ లో గంట‌ల త‌ర‌బ‌డి సాధ‌న చేస్తుంటుంది. ఇక ఈమె జిమ్ వీడియోలు కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంటాయి. అలాగే ప్ర‌గ‌తి ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ సంద‌డి చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఈమె డ్యాన్స్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మ‌రోమారు ఈమె డ్యాన్స్‌తో రెచ్చిపోయింది. గ్లామ‌ర‌స్ డ్రెస్ ధ‌రించి ఈమె చేసిన డ్యాన్స్‌కు యువ‌త ఫిదా అవుతున్నారు. ఈమె డ్యాన్స్‌ను చూసి వారు మైమ‌రిచిపోతున్నారు.

Actress Pragathi latest dance video viral
Actress Pragathi

ప్ర‌గ‌తి ఈ మ‌ధ్యే విడుద‌లైన ఎఫ్3 మూవీలో క‌నిపంచ‌గా.. ఈ మూవీ హిట్ అయింది. దీంతో స‌క్సెస్ మీట్‌లో పాల్గొన్న ఈమె భావోద్వేగానికి గురైంది. తాను త‌న కెరీర్‌లో ఎన్నో పాత్ర‌ల్లో న‌టించాన‌ని.. అయితే ఎఫ్2, ఎఫ్3 మూవీల్లో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర‌ల్లో చేశాన‌ని.. అందుకు అనిల్ రావిపూడికి రుణ‌ప‌డి ఉంటాన‌ని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఈ క్ర‌మంలోనే ఆమె చేసిన కామెంట్లు కూడా వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా ఈ వీడియోతో మ‌ళ్లీ ఈమె నెటిజ‌న్ల‌ను అల‌రిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment