ఏ వయసులో చేయాల్సిన పనులు.. ఆ వయసులోనే చేయాలి.. ప్రగతిపై సెటైర్లు..

August 19, 2022 2:21 PM

టెలివిజన్ రంగంలో జబర్దస్త్ క్రేజ్ మాములుగా ఉండదు. దీనికి తోడు యూట్యూబ్ లో కూడా ఆ వీడియోలే ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ఇటీవల ఒక్కసారిగా ఈ షో రేటింగ్ డౌన్ అయినట్టు కనిపిస్తోంది. దీనికి ముఖ్య కారణం ఈ కామెడీ షో నుంచి కొంత మంది కమెడియన్స్ బయటకు వెళ్లిపోతూ అనేక రకాల ఆరోపణలు చేయడమే అని చెప్ప‌వ‌చ్చు. ప్రస్తుతం జబర్దస్త్ షోకి నటి ఇంద్రజ, ప్రగతి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు.

లేటెస్ట్ గా జబర్దస్త్ షో ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే కామెడీ పంచ్ లతో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. చలాకి చంటి, నూకరాజు, రాకెట్ రాఘవ ఇలా ప్రతి ఒక్కరి స్కిట్స్ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాయి. చలాకి చంటి ముగ్గురు చెల్లెళ్లకు అన్నగా స్కిట్ చేశారు. చెల్లెళ్ళకి పెళ్లి అయ్యే వరకు ఇంకా పెళ్లి చేసుకోని అన్నగా చలాకి చంటి కనిపిస్తున్నారు.

rocket raghava skit on actress pragathi jabardasth promo viral

కమెడియన్ నూకరాజు, దొరబాబు కలిసి చేసిన స్కిట్ నవ్వులు పూయిస్తోంది. సూర్యవంశం మూవీ పేరడీ చేశారు. ఇక రాకెట్ రాఘవ.. నటి ప్రగతిపై సెటైర్లు వేస్తూ చేసిన స్కిట్ హైలైట్ గా నిలిచింది. ప్రగతి గారు మీతో ఎప్పుడూ ఒక విషయం చెప్పాలనిపిస్తూ ఉంటుంది.. అంటూ జిమ్ వర్కౌట్లు మొదలు పెడతాడు.

రాఘవ జిమ్ వర్కౌట్లు చేస్తూనే ప్రగతితో మాట్లాడుతూ ఉంటాడు. దీంతో ప్రగతి నవ్వు ఆపుకోలేకపోతుంది. కాసేపటికి రాఘవ అలసిపోతాడు. పక్కనే ఉన్న వ్యక్తి.. అందుకే ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాల‌ని అంటాడు. తన గురించి చేసిన ఈ స్కిట్ ని ప్రగతి బాగా ఎంజాయ్ చేసినట్లు ఉంది. ఆ మధ్య ప్రగతి జిమ్ కసరత్తులతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే త‌న‌పై స్కిట్ చేసే సరికి ఆమె బాగా ఎంజాయ్ చేసింది. ఇక ఈ ప్రోమో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now