Actress Pragathi : అంత చిన్న వయసులోనే ఆ పని చేయాల్సి వస్తుంది అనుకోలేదు.. ప్రగతి సంచ‌ల‌న కామెంట్స్‌..

October 25, 2022 12:33 PM

Actress Pragathi : వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. మదర్ పాత్రలకు ఆమె, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఒకప్పటి ఆమె ఈమేనా అని భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి ఫిట్నెస్ మీద దృష్టి సారించింది ప్రగతి. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తోంది. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. అయితే ప్రగతి అప్పట్లో 7 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

హీరోయిన్ గా చేస్తున్న ప్రగతి సడన్ గా సీరియల్స్ వైపుకు మళ్లారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం ఉందట. తక్కువ వయసులో తల్లిగా చేయాల్సిన వచ్చిన ప్రగతి పరిశ్రమలో ఎదుర్కొన్న అవమానాల గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రగతి మాట్లాడుతూ.. నేను 24ఏళ్ల వయసుకే తల్లి పాత్రలు చేయాల్సి వచ్చింది. నా వయసున్న హీరోయిన్ కి తల్లిగా చేయడం బాధ అనిపించేది. చంద్రమోహన్ ఫ్యామిలీతో మాకు పరిచయం ఉంది. ఆయన భార్యను నేను ఆంటీ అని పిలిచే దాన్ని, అలాంటిది ఆయన భార్యగా చేయాల్సి వచ్చింది. ఆరోజు బాగా ఏడ్చాను.

Actress Pragathi sensational comments on her film career
Actress Pragathi

సెట్స్ కి రెండు జడలు వేసుకొని వెళితే… ఆమె ఏంటి జడలు వేసుకుంది. కొప్పు ముడి వేసుకోమని చెప్పండి అనేవారు. ఆ మాటలు విని తట్టుకోలేకపోయాను. మేకప్ రూమ్ కి వెళ్లి కన్నీరు పెట్టుకున్నాను అని ప్రగతి చెప్పుకొచ్చారు. ఒక సినిమాలో రైన్ సాంగ్ చేయాలి. కాస్ట్యూమ్స్ విషయంలో అభ్యంతరం చెప్పాను. ఆ కారణంగా ఆ సినిమాను వదిలేశాను. ఆ సంఘటన తర్వాత సినిమాలు వదిలేసి సీరియల్ నటిగా మారానని ప్రగతి చెప్పుకొచ్చారు. 2002లో విడుదలైన బాబీ మూవీతో ప్రగతి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. బాబీ మూవీలో ప్రగతి మహేష్ అమ్మగా నటించడం విశేషం. అక్కడ నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment