Watch Video : 20 మంది ప్ర‌యాణికులు ఉన్న బ‌స్సు.. నదిలో కొట్టుకుపోయింది.. వీడియో..!

September 28, 2021 10:45 AM

Watch Video : గులాబ్ తుఫాన్ కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తోపాటు తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే న‌దులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక చోట్ల కొంద‌రు గ‌ల్లంత‌య్యారు. ఇక మహారాష్ట్ర‌లో ఓ చోట ప్ర‌యాణికులు ఉన్న బ‌స్సు న‌దిలో కొట్టుకుపోయింది.

Watch Video : 20 మంది ప్ర‌యాణికులు ఉన్న బ‌స్సు.. నదిలో కొట్టుకుపోయింది.. వీడియో..!
Watch Video

మ‌హారాష్ట్ర‌లోని య‌వ‌త్‌మ‌ల్ జిల్లా ఉమ‌ర్‌ఖేడ్ తాలూకాలో ఉన్న ఓ న‌దిలో 20 మందితో ప్ర‌యాణిస్తున్న బ‌స్సు కొట్టుకుపోయింది. ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అంద‌రూ చూస్తుండ‌గానే బ‌స్సు న‌దిలో కొట్టుకుపోయింది.

కాగా గులాబ్ తుఫాన్ ఇప్ప‌టికే బ‌ల‌హీన ప‌డి అల్ప పీడ‌నంగా మారింది. దీంతో మ‌హారాష్ట్ర‌లో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ముంబైలోని రీజిన‌ల్ మిటర‌లాజిక‌ల్ సెంట‌ర్ వెల్ల‌డించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now