Nandi : నంది కొమ్ముల్లోంచే శివున్ని ద‌ర్శించుకోవాలి.. ఎందుకో తెలుసా ?

February 25, 2022 8:17 AM

Nandi : ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు గ‌ర్భ గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసి గంట మోగించి ఆ త‌రువాత భ‌క్తులు దైవ ద‌ర్శ‌నం చేసుకుంటారు. అయితే శివాల‌యానికి వెళ్లిన‌ప్పుడు మాత్రం ముందుగా నంది కొమ్ముల్లోంచే శివ లింగాన్ని చూస్తూ ద‌ర్శ‌నం చేసుకోవాలి. ఇలా ఎందుకు ద‌ర్శ‌నం చేసుకోవాలి ? దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

why we should darshan lord Shiva from Nandi horns
Nandi

త్రిమూర్తుల‌లో ప‌ర‌మేశ్వ‌రుడు ఒక‌రు. ఆయ‌న‌కు విగ్ర‌హ రూపం ఉండ‌దు. శివున్ని లింగం రూపంలో మ‌నం ద‌ర్శించుకుంటాం. ఇక శివుడు ల‌య కారకుడు. ఆయ‌న త‌న మూడో క‌న్ను తెరిస్తే సృష్టి అంతం అవుతుంది. క‌నుక అంతటి శ‌క్తి ఉన్న శివున్ని నేరుగా ద‌ర్శించుకోకూడ‌దు. ద‌ర్శించుకుంటే అరిష్టం క‌లుగుతుంది. క‌నుక ఆయ‌న‌ను ముందుగా ఆల‌యం ఎదురుగా ఉండే నంది కొమ్ముల్లోంచి చూస్తూ ద‌ర్శించుకోవాలి.

ఇక నంది కొమ్ముల్లోంచి చూస్తున్న‌ప్పుడు కుడి చేత్తో నంది వీపును నిమ‌రాలి. అదే స‌మ‌యంలో నంది చెవిలో మ‌న గోత్ర నామాలు, మ‌న కోరిక‌లు చెప్పాలి. ఇలా శివ లింగాన్ని ద‌ర్శించుకోవాలి. దీంతో కోరిక కోర్కెలు నెర‌వేరుతాయి. ఎంతో పుణ్య ఫ‌లం ల‌భిస్తుంది. అంతేకానీ శివ లింగాన్ని నేరుగా ద‌ర్శించుకోకూడ‌ద‌ని.. అరిష్టం క‌లుగుతుంద‌ని.. పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment