Viral Video : వామ్మో.. ఇదేం డ్యాన్స్‌రా నాయ‌నో.. చూస్తే వ‌ణుకు పుట్ట‌డం ఖాయం.. వీడియో..!

April 2, 2022 5:47 PM

Viral Video : సాధార‌ణంగా చాలా మందిలో అంతర్గ‌తంగా ఏదో ఒక క‌ళ దాగి ఉంటుంది. ఇది కొన్ని సంద‌ర్భాల్లో బ‌య‌ట ప‌డుతుంటుంది. ఇక అలాంటి క‌ళల్లో డ్యాన్స్ ఒక‌టి. దీన్ని సాధారణంగా చాలా మంది చేస్తారు. కొంద‌రికి పుట్టుక‌తోనే ఈ క‌ళ వ‌స్తుంది. కొంద‌రు డ్యాన్స్ నేర్చుకుని అందులో నిష్ణాతుల‌వుతారు. ఇక కొంద‌రు అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా చేసినా.. డ్యాన్స్ చాలా బాగా చేస్తుంటారు. అయితే ఇలా చాలా మంది ర‌క‌ర‌కాలుగా డ్యాన్స్‌లు చేయ‌డాన్ని మనం చూశాం. కానీ ఓ మ‌హిళ మాత్రం చూసే వారికి భ‌యం పుట్టేలా డ్యాన్స్ చేసింది. అవును.. కావాలంటే.. కింద ఇచ్చిన వీడియోను చూడండి.

Viral Video woman dance entertained everybody
Viral Video

ఓ మ‌హిళ అంద‌రి ఎదుట ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా డ్యాన్స్ చేయ‌డం మొద‌లు పెట్టింది. అయితే పెద్ద‌గా అరుస్తూ భ‌య‌ప‌డిన‌ట్లు ఆమె డ్యాన్స్ చేయ‌సాగింది. కింద ప‌డుతూ లేస్తూ డ్యాన్స్ చేసింది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. దాన్ని డ్యాన్స్ అన‌రు. పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఊగిపోయింది. దీంతో చుట్టూ ఉన్న‌వారికి అస‌లు ఏం జ‌రుగుతుందో అర్థం కాలేదు. అంద‌రూ ఆమెను చూసి చాలా భ‌య‌ప‌డ్డారు. వెన్నులో వ‌ణుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆ స‌మ‌యంలో తీసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అయితే ఆ మ‌హిళ అలా డ్యాన్స్ చేయ‌డాన్ని చూసి నెటిజన్లు సైతం తాము భ‌య‌ప‌డిపోయామ‌ని కామెంట్లు పెడుతున్నారు. అస‌లు ఇది డ్యాన్సేనా.. దీన్ని డ్యాన్స్ అంటారా.. చూసేవారికి వ‌ణుకు పుట్టించేలా.. ఈ డ్యాన్స్ ఏమిటి త‌ల్లీ.. అని నెటిజన్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో వారి కామెంట్ల‌ను కూడా అంద‌రూ ఆస‌క్తిగా చ‌దువుతున్నారు. ఏది ఏమైనా.. ఆ మ‌హిళ చేసిన డ్యాన్స్‌కు దెబ్బ‌కు అంద‌రూ హ‌డ‌లెత్తిపోయారు..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now