Udaya Bhanu : ఉదయభాను కూతురు ఎంత క్యూట్ గా ఉందో చూశారా.. వీడియో..

October 1, 2022 2:16 PM

Udaya Bhanu : ఉద‌యభాను యాంక‌ర్‌గానే కాక సినిమాల్లోనూ కూడా న‌టించి అల‌రించింది. ఈమె రానా హీరోగా వ‌చ్చిన లీడ‌ర్ సినిమాలో రాజ‌శేఖ‌రా.. అంటూ ప్ర‌త్యేక పాట‌లోనూ నర్తించి ఆక‌ట్టుకుంది. ఇటీవల పుష్ప సక్సెస్ ప్రోగ్రాం కర్నూల్ లో యాంకర్ గా చేసి బన్నీ ఫాన్స్ ని అలరించింది. గ్లామరస్ యాంకర్లు ఇప్పుడు బోలెడు మంది ఉన్నారు కానీ ఒకప్పుడు అలాంటి యాంకర్ అంటే మాత్రం ఉదయభానే. హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని పర్సనాలిటీ, అందంతో అందరి మనసు దోచుకుంది. అందం మాత్రమే కాకుండా తన మాటలతో మంత్రముగ్దులను చేసేది.

ఉదయభాను అనగానే హృదయాంజలి షో, సాహసం చేయరా డింభకా, డాన్స్ బేబీ డాన్స్ వంటి షోలు గుర్తొస్తాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదయభాను ఆ తరువాత బుల్లితెరకి దూరమైంది. ఇక ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను టీవీకి, సినిమాలకు పూర్తిగా దూరమైంది. కూతుర్లు పెద్దగా అవ్వడంతో మళ్ళీ యాంకర్ గా బిజీగా ఉండాలని భావించిన ఉదయభాను ఆ దిశగా ప్రయత్నించినా అవకాశాలు రావడం లేదు.

Udaya Bhanu shared her daughter video viral
Udaya Bhanu

ఇక యూట్యూబ్ లో ఛానెల్ పెట్టి తన వ్యక్తిగత జీవితాన్ని అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటున్న ఉదయభాను రీసెంట్ గా తన చిన్న కూతురుతో ఉన్న వీడియోని షేర్ చేసింది. రోజూ ఉదయాన్నే టీ తాగాలనుకుంటే.. నా భూమి తల్లి టీ పెట్టడానికి కావాల్సిన పదార్థాలు కలిపి నాకు హెల్ప్ చేస్తుంది అంటూ కూతురిని ముద్దాడుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లీకూతురు ఇద్దరు క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Udaya Bhanu (@iamudayabhanu)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment