Udaya Bhanu : ఉదయభాను ఇండస్ట్రీకి దూరం అవడానికి వెనుక ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా ?

October 9, 2021 3:19 PM

Udaya Bhanu : ఒకప్పుడు బుల్లితెరపై తన అద్భుతమైన వాక్చాతుర్యంతో, అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్లలో ఉదయభాను ఒకరు. బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలకు యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉదయ భాను ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుని వెండితెరపై కూడా సందడి చేశారు.

Udaya Bhanu left tollywood industry for these reasons

ఇలా వెండితెరపై, బుల్లితెరపై ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఉదయభాను గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరమైపోయారు. అయితే ఈమె ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణం ఈమె ఎదుగుదలను ఓర్చుకోలేక కొందరు ఇండస్ట్రీలో పుట్టించిన కథనాలే కారణమని చెప్పవచ్చు. స్టార్ యాంకర్ గా ఉన్న ఈమె గురించి లేనిపోని వార్తలు పుట్టించారు.

ఈమెకు ఎవరితోనో ఎఫైర్స్‌ ఉన్నాయంటూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టడంతో ఆ వార్తలు ఈమెను కృంగదీశాయని, మానసికంగా ఆ మాటలు తనని భాధించడం వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత ఈమెకు ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి తన పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment