Udaya Bhanu : మరీ ఇంత దారుణ‌మా.. ఉద‌య భాను భ‌ర్త అలాంటివాడా..?

October 24, 2021 12:00 PM

Udaya Bhanu : ఒకప్పుడు టీవీ షోలను ఓ ఊపు ఊపేసిన స్టార్ యాంకర్ ఉద‌య భాను. కొన్నాళ్ల క్రితం ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుని కవల పిల్లల‌ని క‌నింది. వారు పుట్టిన తర్వాత వారికే ఎక్కువ సమయం కేటాయిస్తోంది. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలు చెబుతూ ఉంటుంది. బుల్లితెరకు గ్లామర్ అద్దిన ఉదయభాను ప్రస్తుతం యాంకరింగ్‌కు కాస్త దూరంగానే ఉన్నా.. అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తోంది.

Udaya Bhanu first husband is not correct he was given trouble to her

గ‌తంలో ఉదయభాను గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. ఆమెకు ఎఫైర్స్ ఉండేవంటూ ప‌లు ప్రచారాలు చేసేవారు. అయితే ఉద‌య భాను మొద‌టి పెళ్లి పెటాకులు కాగా, రెండ‌వ పెళ్లి త‌న‌కు నచ్చిన వాడితో చేసుకుంది. ఉదయభానుకు చిన్న వయసులోనే పెళ్లి చేయటం వల్ల పెళ్లి గురించి ఏమాత్రం అవగాహన లేకపోయింది. ఆమె క‌న్నా చాలా ఎక్కువ వయ‌స్సు ఉన్న వ్య‌క్తిని ఇచ్చి పెళ్లి చేయ‌డంతో అత‌నికి డైవోర్స్ ఇచ్చింది. వైవాహిక జీవితంలోనూ మొదటి భర్త సరిగ్గా ఉండేవాడు కాదని.. రూమర్స్‌ వచ్చాయి. అవి నిజమో కాదో తెలియదు. కానీ మొదటి భర్త పోరు వల్లే ఉదయ భాను విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అది గతం.

ఇప్పుడు ఉదయభాను చాలా హ్యాపీగానే ఉందని చెప్పచ్చు. ఉదయభాను దంప‌తుల‌కు 2016లో క‌వ‌ల‌లు జన్మించారు. ఉదయభాను కవల పిల్లలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. అప్పుడప్పుడు వారి ఫొటోలను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న అభిమానుల‌ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. ఉదయ భాను వ్యక్తిగత విషయానికి వస్తే కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలను అనుభవించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment