శనివారం, జూన్ 27, 2026
వార్తలు

Surender Reddy : క‌రోనా బారిన ప‌డ్డ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. ఐసోలేష‌న్‌లో చికిత్స‌..

Surender Reddy : కిక్, రేసు గుర్రం,సైరా వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో నటుడి సరికొత్త…

Surender Reddy : క‌రోనా బారిన ప‌డ్డ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. ఐసోలేష‌న్‌లో చికిత్స‌..

Surender Reddy : కిక్, రేసు గుర్రం,సైరా వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో నటుడి సరికొత్త కోణాన్ని చూపిస్తానని సురేందర్ రెడ్డి అభిమానులకు హామీ ఇచ్చారు. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. థమన్ స్వరాలు సమకూర్చనున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం విదేశాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది.

Surender Reddy got covid positive taking treatment

తాజాగా ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. షూటింగ్‌ కోసం హంగేరి వెళ్లి వచ్చిన ఆయన ఇటీవలే కరోనా బారిన పడ్డారు. సురేందర్‌ రెడ్డితోపాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్థారణ అయినట్లు సమచారం. వారంతా క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నార‌ని, మిగ‌తా చిత్ర బృందం హైద‌రాబాద్‌కి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సురేందర్‌ రెడ్డి కోలుకున్న అనంతరం తిరిగి షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా ప‌వన్ పుట్టినరోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న పవన్ 29వ చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ కూడా వదిలారు. యథా కాలమ్.. తథా వ్యవహారమ్.. అంటూ ఓ పోస్టర్‌ను ప్రకటించారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో గతంలో కిక్, రేసుగుర్రం వంటి హిట్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి