గురువారం, జూన్ 11, 2026
సినిమా

సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్‌.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ మలయాళంలో ఎంతో విజయవంతమైన “అయ్యప్పనమ్ కోషీయమ్” సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. “భీమ్లా నాయక్”…

సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్‌.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ మలయాళంలో ఎంతో విజయవంతమైన “అయ్యప్పనమ్ కోషీయమ్” సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. “భీమ్లా నాయక్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేయగా ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్‌.. అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం..!

పవన్ కల్యాణ్‌ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన సినిమాకు సంబంధించిన వరుస అప్‌డేట్‌ లను విడుదల చేస్తూ పవన్ అభిమానులకు మంచి ట్రీట్ ఇవ్వడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రం విడుదల తేదీని కూడా పవన్ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా వస్తున్న తన 29వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ ఓ పోస్టర్‌ను వదలడంతో ఈ పోస్టర్ వైరల్ గా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి, వక్కంతం కాంబినేషన్ లో ఇప్పటివరకు కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి