గురువారం, జూన్ 11, 2026
వినోదం

ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం.

ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్!
Pawan Kalyan upcoming movie with director Surender Reddy shooting details.
రాజకీయ బాధ్యతలతో పాటు సినిమా షూటింగ్‌కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్. Photo Credit: Pawan Kalyan/Surender Reddy/X.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం. 2026లో సెట్స్‌పైకి వెళ్లే ఆయన తొలి సినిమా దర్శకుడు సురేంద‌ర్ రెడ్డితో తెరకెక్కనుంది. టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా, కథను వక్కంతం వంశీ అందిస్తున్నారు.

పూజా కార్య‌క్ర‌మం వ‌చ్చే నెల‌లో..?

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్‌ను ముందుగానే కేటాయించినట్లు సమాచారం. రాజకీయ బాధ్యతల మధ్య కూడా ప్రతి నెల కొంత సమయం కేటాయించి, షూటింగ్ నిరాటంకంగా సాగేలా ప్రణాళిక రూపొందించారు.

నిర్మాతలు ఈ చిత్రాన్ని ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రాజకీయ కార్యక్రమాల కారణంగా షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్‌ను వేగంగా ముగించాలనే ఆలోచనలో టీమ్ ఉంది.

కాగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మార్చి 26న విడుదల కానుంది. ఆ సినిమా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా సంబంధిత కార్యక్రమాల్లో మరింత చురుగ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి