Suma Kanakala : డ్యాన్స్‌లో పూజా హెగ్డెను మించిపోయిన సుమ.. డ్యాన్స్‌ మామూలుగా లేదుగా..!

March 5, 2022 11:34 AM

Suma Kanakala: బుల్లితెరపై ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అద్భుతమైన వాక్చాతుర్యంతో తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఇక ఈ మధ్య కాలంలో సుమ వరుస సినిమా ఈవెంట్ లతో ఎంతో బిజీగా మారిపోయారు. ఇలా వరుస ఈవెంట్స్, టీవీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న సుమ మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.

Suma Kanakala latest dance video viral
Suma Kanakala

ఈ క్రమంలోనే సుమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక డాన్స్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈక్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముందు సుమ యెల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఈవెంట్ కి ముందు ఇలా వార్మప్ అంటూ నడుమును తెగ ఊపుతూ ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈ వీడియోపై లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈమె ఊపే ఊపుడు ఏకంగా బుట్ట బొమ్మ పూజా హెగ్డెను మించిపోయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సుమ ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉండటమే కాకుండా జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment