Suma Kanakala : రికార్డ్ వ్యూస్ రాబ‌ట్టిన క్యాష్ ప్రోమో.. ఈ క్రెడిట్ ఎవ‌రిది..!

April 26, 2022 7:57 PM

Suma Kanakala : సుమ అంటే క్యాష్‌.. క్యాష్ అంటే సుమ‌. క్యాష్‌ షోని, సుమని విడదీసి చూడలేం. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఈ షో ని సుమ సింగిల్ హ్యాండ్‌తో ర‌న్ చేస్తోంది. ఈ షోకి ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌ముఖులు హాజ‌రు కావ‌డం.. వారు సుమ‌తో క‌లిసి సంద‌డి చేయ‌డం జ‌రుగుతుంటుంది. తాజాగా ఈ షోకి అల‌నాటి సినీ తార‌లు పృథ్వీ, ప్రేమ‌, వెంక‌ట్, రోహిత్ హాజ‌ర‌య్యారు. ఎవ‌ర్‌గ్రీన్ స్టార్స్‌తో చాలా సంద‌డిగా సాగిన ఈ కార్య‌క్ర‌మాన్ని ఏప్రిల్ 30న ప్ర‌సారం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమో రికార్డ్ వ్యూస్ రాబ‌ట్టింది.

cash program of Suma Kanakala got record views
Suma Kanakala

ఈ ప్రోమోకి 1.2 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్, 26వేల‌కి పైగా లైకులు వ‌చ్చాయి. ఇటీవ‌లి కాలంలో క్యాష్‌కి సంబంధించిన ఏ ప్రోమోకి ఈ రేంజ్‌లో రాలేద‌ని అంటున్నారు. పృథ్వీ కామెడీ టైమింగ్, సుమ చమత్కారమైన పంచ్‌లు ఈ షోపై చాలా ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. ఏప్రిల్ 30, 2022న రాత్రి 9 గంటలకు ఈటీవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. దీని కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సుమ కొన్ని ఏళ్లుగా క్యాష్‌ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తోంది. కొత్త కొత్త టాస్క్ లతో, షో ని సరికొత్తగా మారుస్తూ కొత్తపుంతలు తొక్కిస్తోంది. మంచి రేటింగ్‌తో రన్‌ చేయడంలో ముందుంటుంది. సుమ లేకపోతే ఈ షో ను ఎవరు రన్‌ చేస్తారనే సందేహాలు కూడా కలుగుతుంటాయి. ఎవరూ ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు. ఈ అమ్మ‌డు చాలా రోజుల త‌ర్వాత తిరిగి సినిమాల‌లోకి వ‌చ్చింది. మే 6న జ‌య‌మ్మపంచాయ‌తీ సినిమాతో ప‌ల‌క‌రించ‌నుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం సుమ ప‌లు షో ల చుట్టూ తిరుగుతోంది. అలాగే త‌ను క‌మిటైన షోల‌ని కూడా చ‌క్కగా న‌డిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment