Singer Chinmayi : వారిపై సింగ‌ర్ చిన్మ‌యి తీవ్ర ఆగ్ర‌హం.. అలా ఎందుకు చేస్తున్నార‌ని మండిపాటు..!

June 6, 2022 7:40 AM

Singer Chinmayi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సింగ‌ర్ చిన్మ‌యి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె కేవ‌లం సింగ‌ర్ కానే కాదు.. స‌మాజంలోని ఘ‌ట‌న‌ల‌పై స్పందించే వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈమె మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచారాలు, వారిపై చూపించే వివ‌క్ష‌, ఇత‌ర మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తుంటుంది. త‌న సోష‌ల్ మీడియా ఖాతాల వేదిక‌గా ఈమె మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌ను ప్ర‌శ్నిస్తుంటుంది. దీంతో ఈమెకు చాలా మంది మ‌హిళ‌లు త‌మ గోడు చెప్పుకుంటుంటారు. ఇక అలాగే ఇటీవ‌లే ఓ యువ‌తి త‌న గోడును చిన్మ‌యికి తెలియ‌జేసింది. దీంతో చిన్మ‌యి ఆగ్ర‌హం ప‌ట్ట‌లేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే ఆ యువ‌తి ఎవ‌రు, వివ‌రాలు ఏమిటి.. అన్న విష‌యాల‌ను వెల్ల‌డించ‌కుండా.. ఆమెకు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నించింది. అయితే అస‌లు ఏం జ‌రిగింది.. అంటే..

సింగ‌ర్ చిన్మయికి ఇటీవ‌లే ఓ యువ‌తి త‌న బాధ‌ను చెప్పుకుంది. త‌న‌కు 19 ఏళ్లు అని.. 16 ఏళ్లు ఉన్న త‌న త‌మ్ముడు త‌న‌ను ఇష్టం వ‌చ్చిన చోట ఇష్టం వ‌చ్చిన‌ట్లు తాకుతున్నాడ‌ని.. అయితే ఇదే విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెబితే వారు.. వాడు ఇప్పుడే ఎదుగుతున్నాడు, య‌వ్వ‌నంలోకి వ‌స్తున్నాడు, అందుక‌నే కంట్రోల్ చేసుకోలేక‌పోతున్నాడు, వాళ్లు అలాగే చేస్తారు, నువ్వే నీ శ‌రీరాన్ని స‌రిగ్గా దాచుకోవ‌డం లేదు, క‌నుక అది నీ త‌ప్పే.. అని ఆ యువ‌తిని ఆమె త‌ల్లిదండ్రులు నానా మాట‌లు అన్నారు. ఇక ఇదే విష‌యాన్ని ఆ యువ‌తి సింగ‌ర్ చిన్మ‌యికి చెప్పుకుని బాధ‌ప‌డింది. త‌ల్లిదండ్రులే అలా అంటే ఇంక చేసేదేముంటుంది.. వెంట‌నే ఇంట్లో నుంచి వెళ్లిపోదామ‌ని అనుకున్నా.. కానీ నా వ‌య‌స్సు 19 ఏళ్లు అని ఆగాను.. అని ఆ యువ‌తి చెప్పింద‌ని.. సింగ‌ర్ చిన్మ‌యి తెలియ‌జేసింది.

Singer Chinmayi very angry on that girls parents
Singer Chinmayi

ఈ సంద‌ర్భంగా సింగ‌ర్ చిన్మ‌యి ఆ యువ‌తి త‌ల్లిదండ్రుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మీకు అమ్మాయిలు అంటే ఎందుకంత ద్వేషం.. అని ఆమె ప్ర‌శ్నించింది. కాగా చిన్మ‌యి పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే చిన్మయికి ఇలా చాలా మంది మ‌హిళ‌లు, యువ‌తులు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటుంటారు. నువ్వు ఉన్నావ‌నే ధైర్యంతోనే మేము ఇంకా జీవిస్తున్నాం.. అని మ‌హిళ‌లు ఆమెకు మెసేజ్‌లు పెడుతుంటారు. అయితే చిన్మ‌యి ఇలా పోస్ట్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఉన్న‌ట్లుండి ఇలా ఈ పోస్ట్‌తో ఆమె మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment