Singer Chinmayi : సింగ‌ర్ చిన్మ‌యి మ‌రోసారి ఫైర్‌.. మీకు అసలు పనీ పాటా లేదా.. అని తిట్టేసింది..

July 29, 2022 8:21 AM

Singer Chinmayi : లేచింది నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఘంటసాల పాడినట్టుగా సమాజంలో మహిళల గురించి ఎక్కడ ఏ డిస్కషన్ జరుగుతున్నా సరే అక్కడ వెంటనే ప్రత్యక్షమవుతుంది సింగర్ చిన్మయి శ్రీపాద. మీటూ కేవలం హీరోయిన్స్ కి మాత్రమే కాదు సింగర్స్ లో కూడా ఉంటుందని ప్రముఖ సీనియర్ రైటర్ వైరముత్తుతో ఆమె చేసిన ఫైట్ అందరికీ తెలిసిందే. అయితే అది ఇంకా అలాగే కొనసాగుతుందనుకోండి. అయితే సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న విషయాల గురించి చిన్మయి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రశ్నిస్తుంటుంది.

ఇక లేటెస్ట్ గా హీరోల నగ్న ఫోటో షూట్ విషయమై మరోసారి ఆమె కామెంట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ ఎంత పెద్ద హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. రణ్ వీర్ సింగ్ తర్వాత విష్ణు విశాల్ కూడా ఇలాంటి ఫోటోనే ఒకటి పెట్టి షాక్ ఇచ్చాడు. ఇక సింగర్ గీతా మాధురి భర్త నందు కూడా ఇలాంటి ఫోటోతోనే సర్ ప్రైజ్ చేశాడు. కొందరు హీరోయిన్స్ సైతం ఈ ఫోటో షూట్స్ ని మెచ్చుకుంటుండగా కొందరు మహిళలు మాత్రం తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మంచు లక్ష్మి స్పందించి ఇది నిజం కాలేదు.. కాకూడదు.. మీరు సీరియస్ గానే అంటున్నారా.. అని ట్వీట్ చేసింది.

Singer Chinmayi angry on those women for fighting against photoshoots
Singer Chinmayi

ఇక లేటెస్ట్ గా ఈ విషయంపై స్పందించింది చిన్మయి శ్రీపాద. ఈ కేసు వేసిన మహిళలకు అసలు బుద్ధి ఉందా..? పనీ పాట లేదా..? ఇలాంటి వేస్ట్ కేసులు వేసి న్యాయస్థానం టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. దానికి బదులు రేప్ చేసిన ప్రజా ప్రతినిధులకు ఎలా పొలిటికల్ టికెట్ లు ఇస్తున్నాయని కేసులు వేయొచ్చు కదా..? మహిళలను వేధించే ఎంపీలు, ఆడవాళ్ల మధ్య డ్యాన్స్ వేసే సీఎం ల మీద కేసులు చేయొచ్చు కదా..? కేవలం ఇదంతా అటెన్షన్ కోసమే అని.. వారి రక్షణ కోసం ఇది చేయలేదని చిన్మయి కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఈ విష‌యంలో కొంద‌రు ఆమెను ప్ర‌శంసిస్తుండ‌గా.. కొంద‌రు అన‌వ‌స‌ర విష‌యాల్లో వేలు పెట్ట‌డం ఎందుక‌ని చిన్మ‌యికి కౌంట‌ర్ వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now