Singer Chinmayi : త‌న చిన్నారుల‌కు పాలిస్తూ.. ఆనందంలో సింగ‌ర్ చిన్మ‌యి.. ఫొటో వైర‌ల్‌..

October 18, 2022 9:49 PM

Singer Chinmayi : సింగ‌ర్‌ మరియు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీపాద‌  సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు. చిన్మయి స‌మాజంలోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న లైంగిక ప‌ర‌మైన ఇబ్బందుల‌పై ఎటువంటి భయం లేకుండా నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. మీటూ ఉద్య‌మం ప్రారంభ‌మై ఉధృతంగా జ‌రుగుతున్న‌ సమయంలో సినీ ఇండ‌స్ట్రీలో కూడా మీటూ ఉద్య‌మం పెద్ద ఎత్తున జ‌రిగింది. ప‌లువురు న‌టీమ‌ణులు త‌మ‌కు ఎదురైన ఇబ్బందుల‌ను సోష‌ల్ మీడియాతో స‌హా పలు సామజిక మాధ్య‌మాల ద్వారా వారికి ఎదురైన అనుభవాలను పాలుపంచుకున్నారు. ఆ స‌మ‌యంలో ద‌క్షిణాదిన మీటూ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంలో చిన్మ‌యి బాగా కృషి చేశారు.

అంతేకాకుండా ప్ర‌ముఖ పాటల ర‌చ‌యిత వైర‌ముత్తు, సీనియ‌ర్ నటుడు రాధా ర‌విల‌పై పెద్ద ఎత్తున చిన్మయి ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టికీ కూడా చిన్మయి మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూనే ఉంటారు. చిన్మయి సింగర్ గా  కన్న సమంతకి డబ్బింగ్ చెప్పడం ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక అసలు విషయానికి వెళ్తే చిన్మయి న‌టుడు, డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవ‌ల చిన్మయి క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. ఇద్ద‌రి పిల్ల‌ల్లో ఒక‌రికి శర్వాస్, మ‌రొక‌రికి ద్రిప్త అని నామకరణం చేసినట్లు చిన్మయి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Singer Chinmayi shared her latest photo viral
Singer Chinmayi

తాజాగా చిన్మయి త‌న ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట బాగా వైర‌ల్ అవుతుంది. ఇంత‌కీ ఆమె తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా ఏమని పోస్ట్ చేసిందంటే… త‌న క‌వ‌ల‌ల‌కు పాలిచ్చే ఫొటోను ఆమె షేర్ చేసింది. నా క‌వ‌ల‌ల‌కు పాలు ఇలా ఇస్తున్నాను.. ప్రపంచంలో ఇదే అత్యుత్త‌మం. ఇదొక బాధ్యతగా అనిపిస్తుంది. ఈ అనుభూతి చాలా బాగుంది అంటూ ఫోటోతో పాటు మెసేజ్ కూడా షేర్ చేశారు. ఈ విషయంపై సెల‌బ్రిటీలు, చిన్మయి సోషల్ మీడియా ఫాలోవ‌ర్స్ అంద‌రూ పాజిటివ్‌గా స్పందిస్తూ కామెంట్స్ చేశారు. కొంద‌రైతే శివ‌గామిలా ఉన్నావ‌ని, మరికొందరు ఇలా చిన్న పిల్ల‌ల‌కు పాలిచ్చే ఫొటోల‌ను షేర్ చేయ‌వ‌ద్ద‌ని వారికి దిష్టి త‌గులుతుంద‌ని చిన్మాయికి సలహాలు ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now