మంగళవారం, జూన్ 30, 2026
వార్తలు

Shraddha Das : స‌మంత ఐట‌మ్ సాంగ్‌కు శ్ర‌ద్ధా దాస్ స్టెప్పులు.. వీడియో..!

Shraddha Das : పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి పేరు వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. అయితే అందులో కేవ‌లం ఒకే ఒక్క ఐట‌మ్ సాంగ్ చేయ‌డం ద్వారా స‌మంత‌కు కూడా అంతే పేరు…

Shraddha Das : స‌మంత ఐట‌మ్ సాంగ్‌కు శ్ర‌ద్ధా దాస్ స్టెప్పులు.. వీడియో..!

Shraddha Das : పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి పేరు వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే. అయితే అందులో కేవ‌లం ఒకే ఒక్క ఐట‌మ్ సాంగ్ చేయ‌డం ద్వారా స‌మంత‌కు కూడా అంతే పేరు వ‌చ్చింది. ముఖ్యంగా ఆమె న‌టించిన ఐట‌మ్ సాంగ్‌కు చాలా మంది ఆమెలాగా స్టెప్పులు వేస్తున్నారు. ప‌లువురు టీవీ, సినీ న‌టులు ఇప్ప‌టికే ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నారు. తాజాగా న‌టి శ్ర‌ద్ధా దాస్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

Shraddha Das dances for samantha item song in pushpa movie video

పుష్ప సినిమాలో స‌మంత డ్యాన్స్ చేసిన ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. సాంగ్ చాలా పాపుల‌ర్ అయింది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ పాట‌కు డ్యాన్స్ చేస్తూ త‌మ స‌ర‌దా తీర్చుకుంటున్నారు. తాజాగా న‌టి శ్ర‌ద్ధా దాస్ కూడా ఈ పాట‌కు స్టెప్పులేసింది. అనంత‌రం ఆ వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేయ‌గా.. ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

కాగా శ్ర‌ద్ధా దాస్ ఇటీవ‌లే మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తూ వ‌రుస‌గా ప‌లు ఫొటోల‌ను షేర్ చేసి హీట్ పెంచింది. ఆ ఫొటోల్లో ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ కాస్త ఎక్కువే అయింది. అయితే అంత‌గా అందాల‌ను ఆర‌బోసినా.. ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు మాత్రం స‌రిగ్గా రావ‌డం లేదు. మ‌రి ముందు ముందు అయినా ఈమె భ‌విష్య‌త్తు మారుతుందో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి