Samantha : స‌మంత ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సిందే.. లేదంటే రూ.100 కోట్లు గోవిందా..!

June 24, 2022 11:16 PM

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత త‌ర‌చూ ఏదో ఒక విధంగా వార్త‌ల్లో నిలుస్తోంది. అప్ప‌ట్లో ఈమె తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో ఉండి.. మామ్స్ సెయిడ్ పేరిట అనేక కొటేష‌న్స్‌ను షేర్ చేసింది. త‌న జీవితానికి సంబంధించి సందేశాల‌ను పెట్టింది. అయితే ఆ త‌రువాత సినిమాల స్పీడు పెంచేసింది. వ‌రుస‌గా సినిమాల‌ను చేస్తోంది. దీనికి తోడు ప‌లు బ్రాండ్ల‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌మోట్ చేస్తూ నెల‌కు రూ.3 కోట్ల‌కు పైగానే ఈ అమ్మ‌డు సంపాదిస్తోంది. అయితే అంతా బాగానే ఉంది.. కానీ స‌మంత విష‌యంలో నిర్మాత‌ల‌ను ఒకే విష‌యం క‌ల‌వ‌ర‌పెడుతోంది. అదేమిటంటే..

ఈమ‌ధ్యే విడుద‌లైన విరాట ప‌ర్వం మూవీ రిలీజ్‌కు ముందు న‌టి సాయి ప‌ల్ల‌వి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. అయితే దీని ప్ర‌భావం సినిమాపై పెద్ద‌గా ప‌డ‌లేదు. ఎందుకంటే ఆమె సారీ కూడా చెప్పేసింది. క‌నుక ఆ వివాదం అంత‌టితో ముగిసింది. అంత‌కు ముందు సాయిప‌ల్ల‌వి అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు కోపం ఏమీ లేదు. కానీ ఇప్పుడు స‌మంత అలా కాదు. అక్కినేని కోడలిగా ఉన్న‌ప్పుడు ఆమెకు ఎంతో గౌర‌వం ఇచ్చేవారు. అదంతా ఇప్పుడు పోయింది. ఇలాంటి స‌మ‌యంలో స‌మంత ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

Samantha should be careful now with her posts and comments
Samantha

స‌మంత‌పై ప్ర‌స్తుతం నెగెటివ్ కామెంట్స్‌, ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి. ఆమె చైతూను మోసం చేసింద‌నే ఇంకా చాలా మంది ఫీలింగ్‌లో ఉన్నారు. క‌నుక ఇలాంటి స‌మ‌యంలో చైతూను బ్యాడ్ చేసే విధంగా ఎలాంటి మాటలు మాట్లాడ‌కూడ‌దు. పోస్ట్‌లు కూడా పెట్ట‌కూడ‌దు. అలాగే సామాజిక అంశాల‌పై కూడా స్పందించ‌కూడ‌దు. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఏ వివాదంలోనూ ఏ విధంగా కూడా ఇరుక్కోవ‌ద్దు. లేదంటే పెద్ద ఇబ్బందే ఎదుర‌వుతుంది. ఎందుకంటే స‌మంత న‌టించిన శాకుంత‌లం అనే మూవీతోపాటు య‌శోద అనే మూవీ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి.

త్వ‌ర‌లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలు రెండూ క‌లిపి రూ.100 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేస్తాయ‌ని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అన‌వ‌స‌ర వివాదాల్లో చిక్కుకుంటే అది క‌చ్చితంగా సినిమాల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ఇప్ప‌టికే స‌మంత తీవ్ర‌మైన నెగెటివిటీని మూట‌గట్టుకుంది క‌నుక ఇక ముందు ఏం చేసినా.. మాట్లాడినా.. వివాదాస్ప‌దం కాకుండా ఉండాలి. అప్పుడే ఆమె సినిమాలు ఆడే అవ‌కాశాలు ఉంటాయి. రూ.100 కోట్లు వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయి. కాదు, కూడ‌దు.. ఇలాగే ఉండి కామెంట్లు చేస్తూ పోస్టులు పెడ‌తా.. అంటే ఆమెపై ఇంకా నెగెటివిటీ పెరిగిపోతుంది. అప్పుడు మొద‌టికే మోసం వ‌స్తుంది. రూ.100 కోట్లు కాదు కదా.. రూ.1 కోటి వ‌సూలు అయ్యే అవ‌కాశం కూడా ఉండ‌దు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌కు ఇలాగే జ‌రిగింది. క‌నుక స‌మంత త‌న సినిమాలు రిలీజ్ అయి మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధించే వ‌ర‌కు కాస్త ఓపిక ప‌డితే బెట‌ర్‌. లేదంటే దారుణంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఆమె ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment