Samantha : దేనికైనా రెడీ అంటున్న స‌మంత‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

May 8, 2022 5:43 PM

Samantha : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో స‌మంత ఎంత‌గా యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఈ అమ్మ‌డు గ‌తంలో లేని విధంగా స్కిన్ షో చేస్తోంది. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత గ్లామ‌ర్ డోసు పెంచింది. ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ అందాల ఆర‌బోత చేస్తూ మ‌రింత హీట్ పెంచుతోంది. లేటెస్ట్‌గా ఈ అమ్మ‌డు ఓ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన క‌వ‌ర్ ఫొటోషూట్ తాలూకు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. అయితే స‌మంత తాజాగా ఓ పోస్ట్ కూడా పెట్టింది. అందులో ఆమె ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

గ‌తంలో త‌న స్కిన్ టోన్‌పై త‌న‌కు అంత‌గా నమ్మ‌కం ఉండేది కాద‌ని.. అలాగే న‌ట‌న‌లోనూ కాస్త బెరుకుద‌నం ఉండేద‌ని చెప్పింది. అయితే చాలా సినిమాలు చేసిన త‌రువాత ఇప్పుడు త‌న‌కు కాన్ఫిడెన్స్ బాగా పెరిగింద‌ని.. క‌నుక ఇప్పుడు ఎలాంటి ప్రాత‌ను చేసేందుకు అయినా స‌రే సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. అలాగే దేనికైనా రెడీ.. అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో స‌మంత ఉద్దేశం ఏమిటా ? అని నెటిజ‌న్లు ఆలోచిస్తున్నారు.

Samantha says she can do any type of role in the movies
Samantha

ఇక ఈమె ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఈమె న‌టిస్తున్న య‌శోద మూవీ ఆగ‌స్టు నెల‌లో రిలీజ్ కానుండ‌గా.. శాకుంత‌లం అనే మ‌రో మూవీలోనూ ఈమె న‌టిస్తోంది. ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment