Samantha : లీకైన స‌మంత ఫొటోలు.. మ‌రీ ఇంత దారుణంగానా..?

June 19, 2022 8:26 PM

Samantha : టాలీవుడ్ క్యూట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె గ‌తంలో అక్కినేని వారి కోడ‌లిగా ఉన్న‌ప్పుడు ఈమెకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి ఈమెపై ట్రోల్స్, విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. ముఖ్యంగా విడాకుల అనంత‌రం ఈమె త‌న హ‌ద్దుల‌ను మ‌రింత చెరిపేసింది. అందాల ఆర‌బోత‌లో అస‌లు త‌గ్గేదేలే అంటోంది. పుష్ప మూవీలో ఐట‌మ్ సాంగ్‌ను చేయ‌డం ద్వారా గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోసిన స‌మంత అప్ప‌టి నుంచి అందాల ఆర‌బోత‌ను కంటిన్యూ చేస్తూనే వ‌స్తోంది. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఈమె త‌న గ్లామ‌ర్ డోసును పెంచింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఓ అవార్డుల కార్య‌క్ర‌మంలో అయితే గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌ను ధ‌రించి ఎద అందాల‌ను పూర్తిగా బ‌య‌ట పెట్టి చిత్తు చేసింది. దీంతో ఆ ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

స‌మంత కేవ‌లం సినిమాల ద్వారా మాత్ర‌మే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌లు బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేస్తూ నెల‌కు రూ3 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈమె గ్లామ‌ర్ విష‌యంలోనే రోజురోజుకీ మ‌రింత హ‌ద్దులు మీరుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకు ఆమె ఇన్‌స్టా ఖాతాలో పెడుతున్న పోస్టులే సాక్ష్య‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు అందులో గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ షాక్‌కు గురి చేస్తోంది. ఇక తాజాగా మ‌రోమారు స‌మంత‌కు చెందిన అలాంటి ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈమె వాటిని త‌న ఇన్‌స్టా ఖాతాలో అయితే షేర్ చేయ‌లేదు. కానీ ఫొటోషూట్ సంద‌ర్భంగా తీసిన ఫొటోలు కావ‌డంతో స‌హ‌జంగానే వాటిని బ‌య‌ట పెట్టార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ ఫొటోల్లో స‌మంత మామూలుగా లేదు. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె షేర్ చేసిన ఫొటోలు ఒకెత్తు.. ఈ ఫొటోలు ఒకెత్తు అన్న‌ట్లుగా ఆమె ఫొటోలు ఉన్నాయి. ఎద అందాల‌ను పూర్తిగా చూపిస్తూ ఉన్న ఆమె ఫోటోల‌ను చూసి నెటిజ‌న్లు ఖంగు తింటున్నారు. ఆమె ఎందుకు ఇంతలా గ్లామ‌ర్ షో చేస్తుందా.. అని ఆరాలు తీస్తున్నారు.

Samantha latest red color dress photos viral
Samantha

స‌మంత ఇటీవ‌లే ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ ఫొటోకు ఫొటోషూట్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో ఆమె డ్రెస్‌ను చూస్తే ఆ ఫొటోషూట్‌కు చెందిన‌వే అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆమె మేక‌ప్ అవుతుండ‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే ఈ ఫొటోలు ఎలా బ‌య‌టికి వ‌చ్చాయో అర్థం కావ‌డం లేదు. కావాల‌నే లీక్ చేశారా.. లేక స‌మంత చూసీ చూడ‌న‌ట్లు ఊరుకుందా.. అన్న సందేహాలు వ‌స్తున్నాయి. మొత్తానికి ఈ ఫొటోలు మాత్రం సోష‌ల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇవి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల‌పై స‌మంత ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment