Samantha : నాగ‌చైత‌న్య‌ను అస‌లు ఏమాత్రం లెక్క‌చేయ‌ని స‌మంత‌..!

June 21, 2022 10:38 AM

Samantha : ప్ర‌స్తుత త‌రుణంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల‌కు చెందిన వార్త‌లు మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. స‌మంత త‌న విడాకుల‌కు దారి తీసిన కార‌ణాల‌ను.. అక్కినేని ఫ్యామిలీ బండారం మొత్తాన్ని బ‌య‌ట పెట్టింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో ఆమె అన్ని విష‌యాల‌ను చెప్పేసింద‌ని టాక్ న‌డుస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ షో కొత్త సీజ‌న్‌లో స‌మంత ఒక ఎపిసోడ్ లో పాల్గొంద‌ని.. అందులోనే అక్కినేని ఫ్యామిలీ గురించిన అన్ని విష‌యాల‌ను చెప్పేసింద‌ని.. దీంతో నాగార్జున ఫ్యామిలీలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే తాజాగా నాగ‌చైత‌న్య‌పై కూడా కొన్ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అత‌ను శోభిత ధూళిపాల అనే హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడ‌ని.. ఆమె ఉన్న హోట‌ల్‌కు చైతూ చాలా సార్లు వెళ్లాడ‌ని.. అలాగే ఆమెను త‌న కుటుంబ స‌భ్యుల‌కు కూడా చైత‌న్య ప‌రిచ‌యం చేశాడ‌ని.. వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇక ఈ వార్తల నేప‌థ్యంలో ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే..

Samantha do not care about Naga Chaitanya
Samantha

స‌మంత వేస్తున్న వేషాలు న‌చ్చ‌కే చైత‌న్య ఆమెకు విడాకులు ఇచ్చాడ‌ని.. ఆమె ఒక వేశ్య అని.. ఒక నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. అలాగే శోభిత ధూళిపాల‌తో చైతూకు సంబంధం ఉంద‌ని.. క‌నుక స‌మంత భ‌య‌ప‌డాలి.. అన్న‌ట్లుగా కామెంట్ పెట్టాడు. అయితే దీనికి స‌మంత రిప్లై ఇచ్చింది. అవును, నిజంగానే భ‌య‌ప‌డాలి.. అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఆమె ఇచ్చిన రిప్లై వెట‌కారంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అస‌లు చైత‌న్య అంటే స‌మంత లెక్క చేయ‌డం లేద‌ని.. అందుక‌నే ఆమె అలాంటి రిప్లై ఇచ్చి ఉంటుంద‌ని స‌మాచారం. చైత‌న్య ఏం చేసినా తాను ప‌ట్టించుకోన‌ని చెప్పేందుకే స‌మంత ఇలా రిప్లై ఇచ్చింద‌ని అంటున్నారు.

అయితే ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు క‌నుక ఎవ‌రి లైఫ్ వారిది. వారు అవ‌సరం అనుకుంటే ఇంకొక‌రిని పెళ్లి చేసుకోవ‌చ్చు. అంత‌మాత్రం చేత త‌న మాజీ పార్ట్‌న‌ర్ కు ఇంకొక‌రితో అఫెయిర్ ఉంది.. అని భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రూ ఎలాగూ విడిపోయారు క‌నుక‌.. ఎవ‌రు ఎలా ఉన్నా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. క‌లిసి ఉంటేనే ఈ విష‌యం సంచ‌ల‌నం అయ్యేది. విడిపోయారు క‌నుక‌.. ఇంకో భాగ‌స్వామిని వెదుక్కోవ‌డంలో ఇద్ద‌రికీ స‌మాన హక్కు ఉంది. అంత‌మాత్రానికే చైత‌న్య‌, శోభిత విష‌యంలో స‌మంత భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అందుక‌నే ఆమె అలా రిప్లై ఇచ్చింది కాబోలున‌ని అంటున్నారు. ఇక చైత‌న్య‌, శోభితల మ‌ధ్య ఎలాంటి సంబంధం ఉంది.. అన్న విష‌యంపై మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment