Samantha : విడాకుల త‌రువాత స‌మంత దిగిన అత్యంత గ్లామ‌ర్ ఫొటో ఇదే.. చూస్తే మ‌తులు పోవ‌డం ఖాయం..!

June 11, 2022 8:47 PM

Samantha : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియాలో స‌మంత చేస్తున్న హంగామా మామూలుగా ఉండ‌డం లేదు. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తూ ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా గ్లామ‌ర్ షోకు తెర లేపింది. ఆమె నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి ఉన్న‌న్ని రోజులూ మ‌రీ ఇంత‌గా అందాల‌ను ఆర‌బోయ‌లేదు. కానీ చైతూతో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత గ్లామ‌ర్ డోసు మ‌రీ భారీగా పెంచింది. ఈ మ‌ధ్య కాలంలో అయితే వ‌రుస పోస్టుల‌తో అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది.

కాగా స‌మంత ఈ మ‌ధ్యే ఓ బ్రాండ్‌కు చెందిన బ్లాక్ బికినీని ధ‌రించి ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అదే సిరీస్‌లోని ఇంకో ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ ఫొటోను ఆమె త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయ‌లేదు. కానీ బ‌య‌ట‌కు లీకైంది. ఇందులో ఆమె ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేసింది. కింది భాగంలో ధ‌రించిన క్లాత్ పీస్‌ను చూపిస్తూ రెచ్చ‌గొట్టేలా పోజు ఇచ్చింది. అయితే ఈ ఫొటో బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చిందో తెలియ‌డం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం వైర‌ల్ అవుతోంది.

Samantha busy with ad film shootings
Samantha

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో కలిసి ఖుషి అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ ఏడాది చివ‌ర్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే య‌శోద అనే ఇంకో మూవీలోనూ స‌మంత న‌టిస్తుండ‌గా.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. మ‌రోవైపు త్వ‌ర‌లోనే ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఇందులో స‌మంత న‌టిస్తుందా.. లేదా.. అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. కానీ ఓ వైపు సినిమాలు, మ‌రో వైపు యాడ్స్‌తో స‌మంత ఇప్పుడు చాలా బిజీగా ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment