Sajjanar : టీఎస్ఆర్‌టీసీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే.. లేదంటే చ‌ట్ట ప్ర‌కారం వెళ్తాం..

November 10, 2021 8:31 PM

Sajjanar : తెలంగాణ ఆర్‌టీసీని కించ‌ప‌రిచేలా యాడ్ తీశారంటూ ర్యాపిడీ అనే ట్యాక్సీ సంస్థ‌తోపాటు ప్ర‌ముఖ న‌టుడు అల్లు అర్జున్‌కు టీఎస్ఆర్‌టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ లీగ‌ల్ నోటీసులు పంపించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ విష‌యంపై స‌జ్జ‌నార్ మాట్లాడారు. వ్య‌క్తిగ‌తంగా ఈ విష‌యాన్ని తీసుకోవ‌ద్ద‌ని ఆ సంస్థ‌తోపాటు అల్లు అర్జున్‌కు సూచించారు.

Sajjanar  says he will go according to law if allu arjun not asks apology

త‌న‌కు అల్లు అర్జున్‌తో ప‌ర్స‌న‌ల్‌గా ఎలాంటి ఇష్యూస్ లేవ‌ని స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ యూట్యూబ్ వీడియోను విడుద‌ల చేశారు. లీగ‌ల్ నోటీసులు పంపాల‌ని త‌న‌కు ఆస‌క్తి లేద‌ని, కానీ ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లో ముఖ్య భాగం అయిన ఆర్‌టీసీని కించ‌ప‌రిచేలా యాడ్ తీయ‌డం, అందులో అల్లు అర్జున్ న‌టించ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు.

ఇప్ప‌టికే ఆర్టీసీ న‌ష్టాల్లో ఉంద‌ని, ఈ విధంగా యాడ్ లు తీయ‌డం వ‌ల్ల ఆర్టీసీ ఇంకా న‌ష్ట‌పోతుంద‌ని అన్నారు. సెల‌బ్రిటీల‌ను అనేక మంది ఫాలో అవుతార‌ని, వారికి అనేక మంది ఫ్యాన్స్ ఉంటార‌ని, క‌నుక వారు స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే విధంగా మెసేజ్‌ల‌ను ఇవ్వాల‌ని కోరారు. అంతేకానీ.. ఎంతో మంది పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు రోజూ ప్ర‌యాణించే ఆర్‌టీసీ వ్య‌వ‌స్థ‌ను కించ ప‌రిచేలా యాడ్స్ తీయ‌డం స‌రికాద‌న్నారు.

ఈ యాడ్‌ను వెంట‌నే ఉప‌సంహరించుకోవాల‌ని, టీఎస్ఆర్‌టీసీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని స‌జ్జ‌నార్ అన్నారు. లేదంటే చ‌ట్ట ప్ర‌కారం ముందుకు కొన‌సాగుతామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే దీనిపై అటు ర్యాపిడో గానీ, ఇటు అల్లు అర్జున్ గానీ స్పందించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment